Singer Sunitha: ఆ డైరెక్టర్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు - సింగర్ సునీత..!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే మహిళలు పని ప్రదేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోలేక ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొంతమంది వాటిని నిలదొక్కుకొని స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.
ఇకపోతే కొంతమంది తెర పై పెద్దగా కనిపించకపోయినా.. తాము కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తన అందంతోనే కాదు గాత్రంతో కూడా ప్రేక్షకులను, శ్రోతలను అలరించే అతి కొద్ది మంది సింగర్స్ లో సీనియర్ సింగర్ సునీత కూడా ఒకరు. అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపింప చేసిన ఈమె.. తన అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పినా సరే సున్నితంగా రిజెక్ట్ చేసిన మనస్తత్వం ఈమెది. పైగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.. ఎన్నో సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది సునీత.తనకు ఎం ఎం కీరవాణి అంటే చాలా ఇష్టం అని చెప్పిన.. ఈమె తన జీవితంలో ఎదుర్కొన్న ఒక చేదు సంఘటనను.. మూడు సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో.. తెలుపుకొచ్చింది.
సునీత మాట్లాడుతూ.. “ఒక సినిమా లో ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పడానికి నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్లాను అయితే ఆ సినిమా డైరెక్టర్ నన్ను లోపల చూడగానే సునీత మేడం.. నేను మీకు వీరాభిమానిని. అయితే మీరు నా సినిమా కోసం.. పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తెలిపారు. డబ్బింగ్ చెప్పడం ప్రారంభించగానే సునీత మేడం కాస్త సునీత గారు అయిపోయాను. ఇక ఆ తర్వాత కొంత సేపటికి సునీత అని పిలవడం మొదలు పెట్టాడు. ఆ తరువాత కాసేపటికి నాన్న, కన్నా, బుజ్జి అని మాట్లాడారు.నేను ఉన్న కొద్దిసేపటికే ఆయన అలా రూపాంతరాలు చెంది నన్ను అలా పిలవడం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది”.
“అక్కడినుంచి ఎలా వెళ్ళిపోవాలా అనుకున్నాను. అయినా కుదరలేదు. కానీ అతడు ఏం పిలిచినా.. ఏం మాట్లాడినా.. మారు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాను. ఇక అదృష్టవశాత్తు మళ్ళీ ఆ డైరెక్టర్ సినిమాకు పనిచేసే అవకాశం నాకు రాలేదు,” అంటూ చెప్పుకొచ్చింది సునీత . ప్రస్తుతం సరదాగా చేసిన ఈ కాలం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.