Dhandoraa Movie: శివాజీ, నవదీప్ ‘దండోరా’ ఆరంభం.. మోత మోగాల్సిందేనా..!
దండోరా మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా నిర్వహించారు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టారు. బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.
మూవీ మేకర్స్ మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని చెప్పారు.
ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను వెంకట్ ఆర్.శాఖమూరి నిర్వర్తిస్తున్నారు.
గ్యారీ బి.హెచ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తుండగా.. క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రేఖ భోగవరపు కాస్ట్యూమ్ డిజైనర్, ఎడ్వర్డ్ స్టీవ్‌సన్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అనీష్ మరిశెట్టి కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. మార్కెటింగ్ వర్క్స్ టికెట్ ఫ్యాక్టరీ చూసుకుంటోంది.