Teenage Skin Care Tips: అందంగా ఉండాలంటే టీనేజ్ అమ్మాయిలు ఏం చేయాలి
ఆకు కూరలు
డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బయటి పదార్ధాలు సాధ్యమైనంతవరకూ తగ్గించాలి. డైట్‌లో ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి.
ముఖంపై ఎప్పటికప్పుడు హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై నిగారింపు కొనసాగుతుంది.
సన్ స్క్రీన్
బయటకు ఎప్పుడెళ్లినా ముఖం శుభ్రం చేసుకుని సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని వెళ్లాలి. దీనివల్ల సూర్యుని కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
మాయిశ్చరైజర్
ముఖాన్ని శుభ్రం చేసిన తరువాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు. దీనివల్ల అందం దెబ్బతినకుండా ఉంటుంది.
ముఖం శుభ్రంగా ఉంచడం
టీనేజ్ అమ్మాయిల్లో హార్మోనల్ మార్పుల కారణంగా పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ముఖంపై మలినాలు లేకుండా చూసుకోవాలి.