Skin Care Tips: ముఖంపై నల్ల మచ్చలు, పింపుల్స్ దూరం చేయాలంటే ఇలా చేయండి చాలు
పసుపు శెనగ పిండి మిశ్రమం
పసుపు, శెనగపిడి మిశ్రమం రాయడం వల్ల ముఖంపై అద్బుతమైన కాంతి కన్పిస్తుంది. రోజూ రాస్తే మెరుగైన ఫలితాలుంటాయి. లేదా వారంలో 3 సార్లు రాసుకోవచ్చు. ముఖంపై ఉండే వ్యర్ధాలు, మలినాలు దూరమౌతాయి.
బాదం నూనె
ముఖంపై నల్లటి మచ్చలు, మరకలు దూరం చేసేందుకు రోజూ బాదం నూనె మంచి ప్రత్యామ్నాయం. ముఖంపై నిగారింపుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ట్యానింగ్, మచ్చలు, మరకలు తొలగించవచ్చు. రోజూ రాత్రి వేళ నిద్రించేముందు రాసుకుని ఉదయం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
అల్లోవెరా
ముఖానికి అల్లోవెరా రాయడం వల్ల ముఖం మెరుస్తుంది. నిగారింపు వస్తుంది. అల్లోవెరా జెల్ ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. రాత్రి వేళ కూడా రాయవచ్చు. ఉదయం లేచాక ముఖం నిగనిగలాడుతుంటుంది. ఇలా రోజూ చేయాల్సి ఉంటుంది
నిమ్మకాయ
రాత్రి నిద్రించేముందు రోజ్ వాటర్ రాసి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై అద్భుతమైన నిగారింపు వస్తుంది. నిమ్మకాయ ముఖంపై ఉండే నల్లమచ్చల్ని తొలగిస్తుంది. ముఖానికి ఎప్పుడూ సబ్బు ఉపయోగించకూడదు.
ముల్తానీ మిట్టి
ముఖ సౌందర్యం కోసం అమ్మాయిలంతా ప్రయత్నిస్తుంటారు. బయట ఉండే దుమ్ము ధూళి కారణంగా ముఖంపై మచ్చలు, నల్లబడటం కన్పిస్తుంటుంది. చర్మం ట్యానింగ్ అవుతుంటుంది. ముల్తానీ మిట్టి ఇందుకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. ముల్తానీ మిట్టి రాయడం వల్ల ట్యానింగ్, నల్లబడటం వంటి సమస్యలు నిర్మూలించవచ్చు. ముఖంపై సహజసిద్ధమైన అందం తిరిగి వస్తుంది.