Skin Care Tips: ఈ ఐదు అలవాట్లుంటే చాలు సదా యౌవనంగా, అందంగా ఉంటారు
ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక శ్రమ లోపిస్తోంది. రోజు తగినంత కనీసం 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం లేదా యోగా లేదా వాకింగ్ అనేది ఆరోగ్యంగా ఉంచుతుంది.
తగినంత నిద్ర
సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ముందుగా కావల్సింది తగినంత నిద్ర. రాత్రి వేళ రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. దీనివల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయమౌతాయి.
ఫేస్ క్లీనింగ్
రోజూ ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీన్నొక అలవాటుగా చేసుకోవాలి. మేకప్ రాసుకునే అలవాటుంటే రాత్రి పడుకునే ముందే శుభ్రం చేసుకోవాలి. ఉదయం వరకూ ఉంచకూడదు. చివర్లో మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
హెల్తీ డైట్
మన శరీరంలో సగానికి పైగా సమస్యలకు కారణం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. వీటిని సక్రమంగా ఉంచుకుంటే సగం సమస్యలు దూరమౌతాయి.
చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడం
చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా అవసరం. దీనికోసం రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలో వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి.