Skin Care Juices for Summer: రోజూ ఈ జ్యూస్‌లు తాగితే.. వేసవి నుంచి రక్షణ, నిగనిగలాడే అందం మీ సొంతం

Wed, 15 Mar 2023-10:37 am,

టొమాటో జ్యూస్ రోజూ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతివంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

దానిమ్మ జ్యూస్‌లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. అయితే రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

గ్రీన్ టీ అనేది కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి

బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link