Business Ideas For Women: ఈ ఒక్క మెషిన్ కొని తెచ్చుకుంటే.. ప్రతి రోజు కనీసం రూ. 5000 సంపాదించే అవకాశం..ఎవరికీ తెలియని బిజినెస్ సీక్రెట్
Small Business Ideas For Women: మహిళలు ఇంటి వద్ద ఉండి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా. మీ కుటుంబ ఆదాయాన్ని రెండింతలు చేయాలని అనుకుంటున్నారా. అయితే ఏమాత్రం ఆలోచించకండి. మీరు ఇంటి వద్ద ఉంటూనే నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించి పెట్టే ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ ఈరోజు తెలుసుకుందాం.
ఈ ప్లాన్ ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో తిరుగులేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది వస్త్ర వ్యాపారం అని చెప్పాలి. ప్రతి సంవత్సరం జనం కొత్త దుస్తుల కోసం తమ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అందుకే బట్టల వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి.
ప్రతి పండుగకు శుభకార్యానికి జనం కొత్త బట్టలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే సేల్స్ కూడా ఉంటాయి. దీన్ని మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు. ప్రస్తుతం మహిళలు ఎక్కువగా డిజైనర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్న బ్లౌజులు, లెహంగాలు, హాఫ్ శారీలు, ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
వీటి కోసం సాంప్రదాయం మగ్గం వర్క్ చేయించుకుంటారు. అయితే సాంప్రదాయ మగ్గం వర్క్ కోసం ఎక్కువ మంది కార్మికులు అవసరం అవుతుంది. దీనికి సమయం కూడా ఎక్కువగా పడుతుంది. ఈ సాంప్రదాయ వారి మగ్గం వర్క్ కన్నా కూడా వేగంగాను మన్నికగాను లేటెస్ట్ డిజైన్ మీకు కావాల్సిన డ్రెస్ పైన వేసేందుకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.
ఈ మిషిన్ ద్వారా మీరు ఈజీగా మీకు కావాల్సిన బ్లౌజు, డ్రెస్సు, లేహంగా పైన కావలసిన ఎంబ్రాయిడరీ డిజైన్ వేయించుకోవచ్చు. ఈ మిషన్ కొనుగోలు చేసి మీరు ఆర్డర్లను పొందినట్లయితే గంటల వ్యవధిలోనే వారికి డెలివరీ చేయవచ్చు. తద్వారా మీకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, దీన్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గా భావించవచ్చు.
మార్కెట్లో అందుబాటులో ఉన్న మెషిన్ల ధరలు చూసినట్లయితే 8 నీడిల్స్, 15 నీడిల్స్ సామర్థ్యంతో పని చేసేవి 2 లక్షల నుంచి రూ. 4 లక్షల మధ్యలో ఉన్నాయి. మీ ఆర్డర్లను బట్టి డిమాండ్ ను బట్టి మిషిన్ సెలెక్ట్ చేసుకుని కొనుగోలు చేసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మిషన్ కొనుగోలు చేసే ముందు మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ పొందాల్సి ఉంటుంది.
అప్పుడు మీ పని మరింత సులభం అవుతుంది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ద్వారా మీరు ఒక బ్లౌజ్ మీద కనీసం వెయ్యి రూపాయల ఆదాయం పొందవచ్చు. ఈ లెక్కన చూసినట్లయితే ప్రతినెల కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకున్న అవకాశాలు లభిస్తుంది.