Smart Watch Tips: స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి
సిలికాన్ స్ట్రాప్ అనేది చాలా ముఖ్యం. స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు సాధారణ స్ట్రాప్ లేకుండా చూసుకోవాలి. సిలికానా్ స్ట్రాప్ అయితే చేతికి సౌకర్యవంతంగా ఉంటుంది.
కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి స్మార్ట్‌వాచ్‌కు చాలా అవసరం. స్మార్ట్‌వాచ్‌లో కనెక్టివిటీ ఫీచర్లు బాగున్నాయా లేదా చూసుకోవాలి. కనెక్టివిటీ లేకుంటే కాల్ చేయలేరు. స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌వాచ్‌తో కనెక్ట్ చేయలేరు.
ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ విఫలమౌతుంటాం. హెల్త్ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేస్తే ప్రయోజనముంటుంది.
స్పోర్ట్స్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉండేవారు..స్పోర్ట్స్ యాక్టివిటీస్ ట్రాకర్ ఫీచర్ ఉందో లేదా చెక్ చేయాలి. ఈ ఫీచర్ కారణంగా మీరు ఎంత కేలరీలు బర్న్ చేశారు, ఫిట్నెస్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు.
స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు ఎమోల్డ్ డిస్‌ప్లే ఉందో లేదో చెక్ చేయాలి. ఎమోల్డ్ డిస్‌ప్లేలో కలర్ పాప్ బాగుంటుంది. ఫలితంగా యూజర్లకు మెరుగైన విజ్యువల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఎమోల్డ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్ కాస్త ఖరీదైందిగా ఉంటుంది. కానీ ఆకట్టుకుంటుంది.