బీ అలర్ట్: WhatsAppలో ఈ10 తప్పులు చేస్తున్నారా?

Tue, 03 Mar 2020-2:10 pm,

సింపుల్‌ ప్రొఫైల్ పిక్.. వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలు అదేనండీ డీపీలలో మీ వివరాలు పూర్తిగా తెలిసేలా పెట్టవద్దు. దీనివల్ల వ్యక్తిగతంగా ఇబ్బందలు తలెత్తుతాయి. పనిలో మీకు ఆటంకాలు తలెత్తవచ్చు. అందుకే మీ డీపీలు చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకోండి.

ఎవరిని పడితే వారిని, అపరిచిత వ్యక్తులను మీ వాట్సాప్‌లోకి అహ్వానించవద్దు. అలాంటి వ్యక్తులతో చాటింగ్ ఆపేయండి. అంతగా పరిచయం లేని వ్యక్తుల వాట్సాప్ నెంబర్లను బ్లాక్ చేయడం బెటర్. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పుతాయి.

మీ అనుమతి లేకుండా ఏ గ్రూపులో పడితే ఆ గ్రూపులో మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేస్తుంటే ఉపేక్షించవద్దు. అనుమతి లేకుండా గ్రూపులలో యాడ్ చేయవద్దని అలాంటి వ్యక్తులకు సూచించాలి. మీ నెంబర్‌ను గ్రూపులో యాడ్ చేసిన తర్వాత వివరాలు కూపీ లాగే అవకాశాలున్నాయి. ఇది మీ పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. 

ఇతరుల పేరుతో వాట్సాప్ అకౌంట్ వాడవద్దు. ఇలా చేయడం సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. కొన్ని సందర్భాలలో మీరు వాడుతున్న అకౌంట్ మీది కాదని రుజువైతే విశ్వసనీయత కోల్పోతారు. దీనిపై ఫిర్యాదులు వస్తే వాట్సాప్ మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్ యూజర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే యూజర్ల సెక్యూరిటీ నిమిత్తం వాట్సాప్ టూ స్టెప్ వెరిఫికేషన్ అప్లై చేసుకోవాలి. దీంతో సిమ్ స్వాపింగ్ మోసాలకు చెక్ పెట్టవచ్చు.  వాట్సాప్ సెట్టింగ్స్‌కు వెళ్లి Two step verification ఆప్షన్ యాడ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాక్ చేయాలంటే వారికి టూ స్టెప్ వెరిఫికేషన్ పాస్ వర్డ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. అది అంత తేలిక కాదు.

మీ వాట్సాప్ స్టేటస్ మెస్సేజ్‌లను కేవలం మీ బంధువులు, స్నేహితులు, కుటుంబంతో మాత్రమే షేర్ చేసుకోవడం బెటర్. అంతేకానీ ఎవరికి పడితే వారికి ఇలాంటి వివరాలు తెలిస్తే మీ ప్రైవసీకి భంగం వాటిల్లుతుంది. ప్రైవసీ సెట్టింగ్స్ సరిగ్గా వాడి కేవలం మీ పరిచయస్థులకు మాత్రమే స్టేటస్ చూసేలా ఆప్షన్లు యాక్టివ్ చేయాలి. 

వాట్సాప్ యూజర్లు ఎక్కువగా బ్యాకప్ ఆన్ చేస్తారు. కానీ దీనివల్ల మీ డేటా చోరీకి గురవ్వొచ్చు. అందుకే ఆటో బ్యాకప్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి. మీకు కావాల్సిన సమయంలో మాత్రమే డిలీట్ అయిన డేటాను బ్యాకప్ చేసుకోవాలి.

ముఖ్యమైన విషయాల్లో ఇది ఒకటి. వాట్సాప్ ఫొటోలు, వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతాయి. అయితే వాట్సాప్ మీడియా ఫైల్స్ ఆటోమేటిక్‌గా ఫోన్ గ్యాలరీలో యాడ్ అవ్వకుండా ఈ ఆప్షన్‌ను డిసేజుల్ చేయాలి. దీంతో పోర్న్ వీడియోలు, అనవసర గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెస్సేజ్‌లు స్మార్ట్ ఫోన్‌లోకి రావు. దీనివల్ల మీ ఇంటర్నల్ స్టోరేజీపై భారం ఉండదు. 

స్మార్ట్ ఫోన్ యూజర్లు పోర్న్ వీడియోలు, లింక్‌లు, ఫొటోలు షేర్ చేయవద్దు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

విశ్వసనీయత లేని సమాచారం, వార్తలను వ్యాప్తి చేయవద్దు. మీరు మీ స్నేహితులకు, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం వల్ల అసత్యాలను ప్రచారం చేసిన కారణంగా మీకు చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మతాలు, కులాలు లాంటి విషయాలకు సంబంధించి దుష్ప్రచారం చేయకుండా ఉండటం ఉత్తమం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link