Snake Bite: ప్రెగ్నెంట్ మహిళలను పాములు కుట్టవంట.. దీని వెనుక ఉన్న ఈ రహస్యాలు మీకు తెలుసా..?
మన ఇళ్లలో దట్టంగా చెట్లు, చెత్త కూరుకుపోయి ఉంటే అక్కడ పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఎలుకలు ఉన్న చోట కూడా పాములు ఎక్కువగా సంచరిస్తాయి. పంట పొలాలలో కూడా ఇవి ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే పాములు మనిషి కంట పడినప్పుడు కాటు వేస్తుంటాయి.
పాములు మనిషి కంటపడగానే కాటువేయవని చెబుతుంటారు. మొదట అవి బుస్ బుస్ అంటూ సౌండ్ చేస్తాయి. ఆ సమయంలో కనుక అలర్ట్ అయితే మాత్రం పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు. అస్సలు.. పాములకు మనం నడిచేటప్పుడు భూమి నుంచి కొన్ని కంపనాలు వాటి శరీరానికి తాకుతాయి. దీంతో అవి అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోతుంటాయి.
ఎవరు కూడా సాధారణంగా పాములు కన్పించాలని కోరుకోరు. కొందరికి పాములంటే చచ్చేంత భయంగా ఉంటుంది. పాములు అక్కడుందంటే.. అమ్మబాబోయ్ అని అక్కడి నుంచి దూరంగా పారిపోతారు. అయితే.. ప్రెగ్నెంట్ లేడీస్ ను పాములు అస్సలు కాటువేయవంట దీనివెనుక రెండు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణంలో ఒక గర్భవతి అయిన మహిళ తపస్సు చేస్తుందంట. అప్పుడు రెండు పాములు వచ్చి ఆమె తపస్సును భంగం చేశాయంట. అప్పుడు ఆ మహిళ కడుపులో నుంచి బిడ్డబైటకు వచ్చి పాములను శపిస్తుందంట. ఎప్పుడైన పాములు ప్రెగ్నెంట్ లేడీస్ ను చూస్తే అప్పటి నుంచి అవి చూపు కోల్పోతాయని శపించిందంట. అప్పటి నుంచి పాములు ప్రెగ్నెంట్ లేడీస్ ను కాటేయవంట
ఇక.. గర్భవతులుగా ఉన్నప్పుడు నార్మల్ మహిళలో ఉన్న హర్మోన్లకు, ప్రెగ్నెంట్ లేడీస్ శరీరంలో ఉన్న హర్మోన్ లలో చాలా తేడా ఉంటుంది. వీటిని పాములు గ్రహిస్తాయని చెబుతుంటారు. అందుకే పాములు గర్భవతులు ఉన్న చోట అస్సలు ఉండవంట. ఒక వేళ ఉన్న పాములు గర్బవతులుగా ఉన్న మహిళలను అస్సలు కాటు వేయవంట.
ప్రెగ్నెంట్ మహిళల్లో శారీరక మార్పులు రోజురోజుకు భిన్నంగా ఉంటాయి. వీరి నడిచేటప్పుడు కూడా కొన్ని తరంగాలను పాములు గుర్తుపడతాయంట. ఇది సైంటిఫిక్ గా కూడా రుజువైందని కొందరు చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)