Sobhita-Nagachitanya: శోభితాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. సమంతా పోస్ట్ వైరల్.. షాక్‌లో అక్కినేని అభిమానులు..

Thu, 07 Nov 2024-11:53 am,

నాగ చైతన్యకు డైవర్స్ అయిపోయాక చాలా ఏళ్ల పాటు ఆయన సింగిల్ గానే ఉన్నారు. కానీ అనుకొని విధంగా ఆయన శోభితా ధూళిపాళతో ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని మొదట్లో కేవం పుకార్లు అంటు కొట్టేశారు.  

కానీ అనూహ్యాంగా వీరిద్దరి ఎంగెజ్ మెంట్..ఆగస్టు 8 2024 న జరిగిపోయింది. కొద్ది మంది కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మధ్యన వీరి ఎంగెజ్ మెంట్ జరిగింది. అక్కినేని నాగార్జున తన కొడుకు, కాబోయే కోడలి ఎంగెజ్ మెంట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పొస్ట్ చేశారు.

ఈ క్రమంలో ఇటీవల శోభితా ధూళిపాళ ఇంట్లో పసుపు దంచుడు కార్యక్రమంలో కూడా జరిగింది. శోభితా చీరకట్టుకుని మరీ పెళ్లి పనులు స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో శోభితా పసుపు దంచుడు కార్యక్రమం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

మరొవైపు శొభితా చైతుల పెళ్లి.. డిసెంబరు 4 న జరగనుందని తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం దీనిపైన కూడా ఇరు కుటుంబాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయని,అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు సైతం చేస్తున్నట్లు తెలుస్తొంది.

ఈ క్రమంలో శోభితా ధూళిపాల సోదరి పేరు సమంతా. అయితే.. తాజాగా.. సమంతా తన సోదరి పెళ్లి డేట్ దగ్గర పడుతుందని కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని కూడా పోస్ట్ పెట్టింది. అయితే.. కొంతమంది నెటిజన్లు మాత్రం సమంతా అనగానే.. చైతు మాజీ భార్య.. కౌంట్ డౌన్ అంటూ ఏదో పొస్ట్  పెట్టిందంటూ రూమర్స్ వ్యాప్తి చెందిస్తున్నారు. మొత్తానికి శొభితా పెట్టిన పొస్టు మాత్రం ఒకింత కాంట్రవర్షీగా మారిందని చెప్పుకొవచ్చు.  

ప్రస్తుతం శొభితా చైతల పెళ్లి పనులు సందడి మొదలైంది. ఎక్కడ చూసిన కూడా చైతు, శోభితల పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రీవెడ్డింగ్ షూట్ ఉంటుందని కూడా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైన వీరి పెళ్లి కొసం మాత్రం అక్కినేని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link