Sobhita Dhulipala: రెడ్ కలర్ చీరలో పుత్తడి బొమ్మల కన్పిస్తున్న శొభిత ధూళిపాళ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
అక్కినేని ఇంట ప్రస్తుతం శోభిత, చైతు పెళ్లి వేడుకల హడావిడి నడుస్తుందని చెప్పుకొవచ్చు. ఇటీవల వీరిద్దరి హల్దీ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటంబ సభ్యులు, శోభిత కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తొంది.
అదే విధంగా మంగళ స్నానాలు కార్యక్రమం కూడా వేడుకగా నిర్వహించారు. ప్రస్తుతం అక్కినేని అభిమానులు సైతం.. చైతు, శోభితల పెళ్లిని చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారంట.
మరోవైపు శోభితతో కలిసి కొత్త జీవితంను స్టార్ట్ చేసేందుకు ఎంతో ఎదురు చూస్తున్నానని చైతు ఇప్పటికే చెప్పేశారు. మరొవైపు.. శోభిత సైతం.. కోడలిగా వెళ్లే ఇంట ఏఎన్నార్ వేడుకల్లో అందరిని పలకరిస్తు.. పెళ్లికి ముందే కోడలి దర్జాను సొంతం చేసుకుంది.
వీరి పెళ్లి డిసెంబరు 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభిత ధూళిపాళ తాజా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శోభితా రెడ్ కలర్ చీర వేసుకుని, నగలు పెట్టుకున్నారు. అంతే కాకుండా.. శోభితను పెళ్లి కూతురులా రెడీ చేసినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలోఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అక్కినేని అభిమానులు మాత్రం.. అచ్చం మా శోభితమ్మ.. పుత్తడి బొమ్మలా ఉందంటూ కూడా ప్రశంసిస్తున్నారంట. చైతు పెళ్లి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంట.
అదే విధంగా ఇటీవల అఖిల్, జైనబ్ ల ఎంగెజ్మెంట్ కూడా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శోభితా రాకతో.. తమ అక్కినేని కుటుంబంలో వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయని ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఫుల్ జోష్ గా ఉన్నారంట.