Sobhita: ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన శోభిత.. పెళ్లిపై అలాంటి నిర్ణయం..!
అక్కినేని నాగచైతన్య - శోభిత దూళిపాళ డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు వీరి వివాహాన్ని జరిపించడానికి పెద్దలు నిర్ణయించినట్లు ఇటీవల నాగచైతన్య తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాదు శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తాను చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను అని కూడా తెలిపారు.
మరోవైపు శోభిత ధూళిపాళకు కూడా తన ఇంట్లో పసుపు దంచడం, గోధుమ రాయి వంటి పనులు కూడా పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.
అయితే శోభిత ఇప్పుడు.. పెళ్లి పై తీసుకున్న నిర్ణయానికి అభిమానులు షాక్ అవుతున్నారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బహిరంగంగా ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా నయనతార బాట పట్టినట్లు సమాచారం.
పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని శోభిత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్ణయానికి నాగచైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనిని స్ట్రీమింగ్ చేయడానికి స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో నయనతార కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని ఫాలో అవుతోంది శోభిత. అంతేకాదు హీరోయిన్ నయనతార తన జీవిత కథను డాక్యుమెంటరీ రూపంలో కూడా తెరకెక్కించారు. ఇటీవల నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో కూడా విడుదలైంది. ఇప్పుడు నాగచైతన్య శోభిత కూడా ఇదే ఫాలో అవుతుండడం చాలా ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు అప్పుడే ఆదాయం తీసుకురావడం మొదలుపెట్టిందంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. డైరెక్ట్గా ఫోటోలు షేర్ చేయకుండా ఇలా నెట్ ఫ్లిక్స్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే.. అందరూ చూసినట్టు ఉంటుంది. అలాగే మనీ కూడా వస్తుందని ఆలోచించిందేమో కొత్త కోడలంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.