Sobitha Dhulipala: జోరుగా హుషారుగా శోభితా ధూళిపాల బోటు షికారు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగు అందం.. ముందుగా ఈమె తెలుగు సినిమా కుండా హిందీ సినిమా 'రమన్ రాఘవ్ 2.O' మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది.
కెరీర్ బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకుంటుంది శోభితా.
31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో జన్మించిన శోభితా దూళిపాల.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది.
తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శోభితా.
కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్' వంటి వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం శోభితా ధూళిపాల సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీగా ఉంది.