Poori Making: పూరీలు సరిగ్గా పొంగట్లేదని బెంగపడుతున్నారా..?.. ఈ టిప్స్ పాటిస్తే హోటల్ స్టైల్‌లో బెలూన్‌లా పొంగుతాయి..
పూరీలు చేయడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పుకొవచ్చు. అయితే.. గోధుమ పిండిని నానబెట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం పూరీలు గుల్ల మాదిరిగా పెద్దగా పొంగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదట గోధుమ పిండిని తెచ్చుకుని దాన్ని ఒక గిన్నెలో వేసుకొవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో పిండిని నానబెట్టాలి. పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకొకుండా ఉండేలా వచ్చేవరకు కూడా చక్కగా కలపాలి..
గోధుమ పిండిలో కొద్దిగా మైదాపిండి కలుపుకొవాలి. లేకపోతే.. చక్కెరను గోధుమ పిండిలో కలుపుకుని పూరీలు చేస్తే.. ఆ పూరీలు హోటల్ స్టైల్ లో పొంగుతాయి.అంతే కాకుండా..సిమోలీనా, టాపియోకా పిండి ఒకటి లేదా రెండు స్పూన్ లు, చిన్న గ్లాస్ నిండా గోధుమ పిండిలో కలుపుకొవాలి.
వీటిని గొధుమ పిండిలో కలుపుకుని ఆపిండిని ఒక అరగంట పాటు చక్కగా నానేలా చూడాలి. ఆతర్వాత పూరీలు చేస్తే మాత్రం అవి హోటల్ స్టైల్ లో పెద్దవిగా పొంగుతాయి. దీంతో పూరీలు మెత్తబడిపోతున్నయన్న సమస్య ఉండదు.
పూరీలను ఎక్కువగా గాలి తగిలేలా మాత్రం అస్సలు ఉంచకూడదు. పెద్దగా ఉండే బౌల్స్ లను పూరీలను ఉంచడానికి ఉపయోగించాలి. పూరీలను ఆలు కర్రీ లేదా బటానీ కర్రీలతో తింటే యమ్మీగా ఉంటుంది.
కానీ పూరీలను ఎక్కువగా తింటే.. మాత్రం ఫెస్ మీద మొటిమలు వస్తాయి. పూరీలు తింటే.. కొందరికి ఎక్కువగా దాహాం వేయడంతో పాటు డల్ గా నిద్ర వచ్చినట్లు ఉంటుంది.