Dos And Donts Of Solar Eclipse 2021: సూర్య గ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి జోలికి అసలు వెళ్లరాదు
Dos And Donts Of Solar Eclipse 2021 : ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. రెండు సూర్యగ్రహణాలుండగా, అందులో తొలి గ్రహణం నేడు (జూన్ 10న) ఏర్పడుతుంది. దాదాపు 5 గంటల మేర గ్రహణ సమయం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేటి మధ్యాహ్నం 1:42 గంటలకు పట్టే సూర్యగ్రహణం (Solar Eclipse 2021) సాయంత్రం 6:41 గంటలకు వీడనుంది. గ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Solar Eclipse 2021 Date, Timings: తొలి సూర్య గ్రహణం 2021, జూన్ 10న ఆకాశంలో అద్భుతం
గ్రహణం సమయంలో నూతన కార్యక్రమాలు చేపట్టవద్దని జ్యోతిష్కులు, ఖగోళ నిపుణులు సూచిస్తున్నారు. సూర్య గ్రహణాన్ని నేరుగా వీక్షిస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నల్లని అద్దాల ద్వారా వీక్షించాలని సూచిస్తారు.
సూర్య గ్రహణం సమయంలో బయట తిరగవద్దు. నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. చెడు శక్తులు ప్రభావం సూర్య గ్రహణం సమయంలో అధికంగా ఉంటని పెద్దలు చెబుతారు.
Solar Eclipse 2021 | సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. గ్రహణం సమయంలో కత్తి, చాకు, కత్తెర లాంటి పదునైన వస్తువులు వాడరాదు.
గ్రహణం సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గ్రహణం సమయంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. పవిత్రమైన కార్యాలు వాయిదా వేసుకోవాలి.
Also Read: Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి
సూర్యగ్రహణం సమయంలో ఆహారం తీసుకోరాదు. గ్రహణానికి ముందే తినడం మంచిది. చిన్నారులు, పేషెంట్లు, వయోజనులకు ఆహారం ఇవ్వడంలో తప్పులేదు. పూజా గదిలో దేవుడి విగ్రహాలు, పటాలు తాకరాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook