Solar Eclipse Myths and Facts: సూర్య గ్రహణం ప్రభావం ఆరోగ్యంపై పడుతుందా, ఏది నిజం ఏది మిద్య
గ్రహణం సమయంలో కళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాసా చెబుతోంది. గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు. కంటి రెటీనా పాడయ్యే అవకాశముంది. సోలార్ గ్లాసెస్ వినియోగించాలి.
సూర్య గ్రహణానికి లింక్ అయి ఉన్న చాలా వరకు మూఢ విశ్వాసాలను నాసా ఖండించింది. సూర్య గ్రహణం సమయంలో బోజనం చేయడం వల్ల రేడియేషన్ కారణంగా ఆ ఆహారం పాడవుతుందంటారు. కానీ అదే నిజమైతే పంటలు కూడా పాడయిపోవాలి కదా అని నానా వివరణ ఇచ్చింది.
సాధారణంగా సూర్య గ్రహణాన్ని అశుభసూచకంగా భావిస్తారు. ఈ గ్రహణం కారణంగా వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అశాంతి కలగవచ్చు. కొంతమంది సూర్య గ్రహణం సమయంలో భయాందోళనకు గురి కావచ్చు.
సూర్య గ్రహణం మీ దినచర్యపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. వెలుగు ఒక్కసారిగా మారిపోవడం వల్ల పకృతిపరమైన ప్రక్రియలో ఇబ్బంది రావచ్చు. నిద్రలో ఇబ్బంది కలగవచ్చు. హార్మోనల్ సమస్య రావచ్చు.
భారతదేశంలో హిందూ జ్యోతిష్యుల ప్రకారం సూర్య గ్రహణానికి అత్యంత మహత్యం, ప్రాధాన్యత ఉంది. సూర్య గ్రహణం రోజున హిందూవులు చాలా పూజలు పునస్కారాలు చేస్తారు. గ్రహణం రోజున బయటకు వెళ్లడం, గ్రహణం సమయంలో తినడంలేదా తాగడం నిషేధం. గర్బిణీ మహిళలు గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలంటారు. ఇందులో కొన్ని శాస్త్రీయంగా నిజమైతే కొన్ని అవాస్తవాలు
సూర్య గ్రహణానికి సంబంధించి అనాదిగా ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలు అన్నీ అవాస్తవాలు, అంధ విశ్వాసాలు. ఇదొక ఖగోళ ప్రక్రియ మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతారు. కానీ కొన్ని మత విశ్వాసాల ప్రకారం సూర్య గ్రహణం ప్రభావం మనిషి ఆరోగ్యంపై ప్రతికూలంగా ఉంటుంది