Cold Water Side Effects: సమ్మర్ లో ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..?.. ఈ డెంజర్ లో పడ్డట్లే..

ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది కూల్ వాటర్ తాగుతుంటారు. ఫ్రిజ్ లో బాటిళ్లలో చల్లని నీళ్లు నింపేసి, ఎంత కూల్ గా ఉన్న కూడా అవే నీళ్లను తాగుతుంటారు. కనీసం బాటిళ్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొరు. దీంతో బాటిల్ లోపల అడుగుభాగంలో బాక్టిరియా చేరిపోయి ఉంటుంది.

ఆఫీసులు, బైట నుంచి రాగానే నేరుగా ఫ్రిజ్ ల దగ్గరకు వెళ్లి చల్లని నీళ్లు తాగుతుంటారు. చల్లని నీళ్లు తాగడం వల్ల.. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.ఈ క్రమంలో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవక మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల కొందరిలో నోటిలో పుండ్లు కూడా వస్తాయి.

నాలుకపై రుచిని గుర్తించే గుళికలు ఉంటాయి. ఇవి చల్లని నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల తమ గుణాలను కోల్పోతాయి. క్రమంగా గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఏర్పడుతుంది. ఇది ఇమ్యునిటిపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీంతో తొందరగా మన శరీరం అనారోగ్యానికి గురౌతుంటుంది.
కొందరిలో దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పండ్లు చల్లని నీళ్లు తాగగానే పళ్లు జువ్వు మంటాయి. పంటినొప్పితో కూడా బాధపడుతుంటారు. అందుకే ఎక్కువగ చల్లని నీళ్లను తాగడంను అవాయిడ్ చేయాలి. ఐస్ గా మారిన నీళ్లను అస్సలు తాగకూడదు.
అన్నంతినే ముందు కొందరు అతిగా నీళ్లు తాగుతుంటారు. దీంతో సరిగ్గా అన్నం తినరు. ఇదే అలవాటుగా మారితే శరీరానికి కావాల్సిన , శక్తి అస్సలు దొరకదు. చల్లని నీళ్లు తాగడం వల్ల మన నరాలు కూడా ప్రభావానికి గురౌతాయి. దీంతో నరాలు వాపు కూడా సంభవిస్తుంది.
ఎండకాలంలో ఫ్రిజ్ నీళ్లకు బదులుగా, కుండలోని నీళ్లను తాగితే ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయని, దీని వల్ల దాహాం తీరడంతో పాటు ఎలాంటి ఇతర ఇబ్బందులు కూడా రావని నిపుణులు చెబుతుంటారు.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)