Sourav Ganguly: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో సౌరవ్ గంగూలీ డేటింగ్.. బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన ఆ భామ ఎవరంటే..?
ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి.. టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది నటి నగ్మా. గంగూలీతో బ్రేకప్ గురించి ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. తల్లి కోరిక మేరకు ఆమె సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
1990లో సల్మాన్ ఖాన్ మూవీ 'బాఘీ: ఎ రెబెల్ ఫర్ లవ్'తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ కావడంతో నగ్మా పేరు అప్పట్లో మారుమోగిపోయింది.
ఆమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి వరుసగా ఆఫర్లు క్యూకట్టాయి. సినిమా లైఫ్ సాఫీగా సాగినా.. 1999 నాటికి నగ్మా తన వ్యక్తిగత జీవితంపై చాలా రూమర్లు బయటకు వచ్చాయి.
సౌరవ్ గంగూలీతో నగ్మా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇద్దరు చాలాసార్లు కలిసి కనిపించడం రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే గంగూలీకి భార్య డోనాతో అప్పటికే పెళ్లి అయింది.
ఓ ఆలయంలో గంగూలీ, నగ్మా కనిపించడంతో ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడిచింది. భార్య డోనాతో గంగూలీ విడిపోనున్నారని వార్తలు తెరపైకి వచ్చాయి.
నగ్మాతో ప్రేమయాణం గంగూలీ వైవాహిత జీవితంపై ప్రభావం చూపించింది. డోనా విడాకులకు సిద్ధమయ్యారని తెలిసింది. దీంతో గంగూలీ తన తప్పును తెలుసుకుని.. నగ్మాకు దూరమయ్యారని ఓ రూమర్ ఉంది.
గంగూలీతో బ్రేకప్ తరువాత నగ్మా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు.
2003లో సావి అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ పేరు ప్రస్తావించకుండానే తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు.