Top Hero Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆస్తుల్లో ఈ హీరోను మించిన తోపు లేడు.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాదు..

Mon, 11 Nov 2024-4:24 pm,
Pan India Stars

ప్రస్తుతం ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టు తెలుగులోనే ఎక్కువ మంది ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. అంతేకాదు ఈ హీరోలు ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ వీళ్లెవరు కూడా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ఆస్తులున్న హీరోలు వీరెవరు కాదు.

Senior Top Stars

యస్.. తెలుగు సీనియర్ టాప్ స్టార్స్ అయిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు ఆస్తులు కూడా ఈ హీరో కంటే దిగదుడుపే. ఈ రేంజ్ లో ఆస్తులు  కూడ బెట్టిన  స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు.

Kannada Kantiravva

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ఆస్తులున్న హీరో ఎవరో కాదు..  కన్నడ కంఠీరవ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శివ రాజ్ కుమార్ అలియాస్ శివన్న. ఈయన ఆస్తులు విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం తర్వాత ఈయన కుంగిపోయాడు.

ప్రస్తుతం కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వాటి నుంచి కోలుకోవడానికి ప్రకృతి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పాడు.

 

ఇప్పటికే ఆయుర్వేద చికిత్సలో భాగంగా నాలుగు సెషన్స్ లో ఇప్పటికే రెండు పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే అమెరికాలో చికిత్స చేయించుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా శివన్న ఆస్తుల వివరాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. శివన్న భార్య గీత శివకుమార్ షిమోగాలో కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో వీరి ఆస్తులు వివరాలు చర్చనీయాంశంగా మారాయి.

62 యేళ్ల వయసులో హీరోగా నటిస్తున్న శివన్న.. ప్రతి సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడట. శివన్న అసలు పేరు పుట్టస్వామి. శివరాజ్ కుమార్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 4.82 కోట్లు.. గీత బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 64 లక్షలు.. శివన్నకు రూ. 18 కోట్లు.. గీతకు రూ. 5 కోట్లు పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించాయి.

స్థిరాస్థి విషయానికొస్తే.. శివన్న పేరిట రూ. 31 కోట్ల స్థిరాస్థి ఉందట. గీతకు రూ. 34 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మార్కెట్ రేటు ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు రూ. 1500 కోట్లకు పైగా ఆస్తులు ఉందట. ఈ రేంజ్ లో మన తెలుగు హీరోలెవరికీ లేవట.

మరోవైపు శివన్న పేరిట రూ. 17 కోట్ల రుణం ఉంది. అందులో కొంత తీర్చాడు. ఇది సముద్రంలో కాకి రెట్టంత. మొత్తంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో ఆస్తులు ఉన్న నటుడు మరొకరు లేరు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link