Sprouts Benefits: రోజూ ఇవి గుప్పెడు తింటే చాలు నమ్మలేనన్ని లాభాలు, 6 సమస్యలకు చెక్
బరువు నియంత్రణ
పెసర మొలకల్లో కేలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దాంతో ఎక్కువసేపు ఆకలేయదు. క్రేవింగ్ తగ్గుతుంది. బరువు నియంత్రణలో దోహదపడుతుంది.
మెరుగైన జీర్ణక్రియ
రోజూ ఉదయం పర గడుపున పెసర మొలకలు తింటే చాలా మంచిది. ఇందులో పుష్కలంగా పైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్తి సమస్యల్ని దూరం చేస్తుంది.
ఇమ్యూనిటీ
పెసర మొలకల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. చాలా రకాల వ్యాధుల్ని దూరం చేస్తుంది.
చర్మ సంరక్షణ
పెసర మొలకల్లో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో చర్మం ఆరోగ్యవంతంగా, నిగనిగలాడుతుంది. పింపుల్స్, ముడతలు తొలగిపోతాయి. ముఖంపై మచ్చలు కూడా ఉండవు
ఎనీమియాకు చెక్
పెసర మొలకల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎనీమియా నుంచి కాపాడేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఎముకలకు బలం
పెసర మొలకల్లో కాల్షియం, ఫాస్పరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గిస్తుంది.