Sravana masam Fasting: శ్రావణ మాసంలో ఉపవాసాలు చేస్తున్నారా.. బీపీ, షుగర్ పెషెంట్లు ఈ తప్పులు చేయోద్దు..

Tue, 06 Aug 2024-2:35 pm,

శ్రావణ మాసంలో వరసగా పండగలు ఉంటాయి. ముఖ్యంగా నాగపంచమి, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతాలు,జన్మాష్టమిలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. రోజంతా పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకొకుండా ఫాస్టింగ్ ఉంటారు.శ్రావణ సోమ, శుక్ర, శనివారాలలో ఎక్కువ హంది ఉపవాసాలు పాటిస్తుంటారు.   

కానీ శ్రావణ మాసంలో ఉపవాసాలు చేసేటప్పుడు కొన్నిజాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇటీవల చాలా  మంది బీపీలు, షుగర్ లలో తెగ బాధడపడిపోతుంటారు. దీని వల్ల అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వీరు ఈమాసంలో ఇంకా ఉపవాసాలు చేస్తే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. 

పూజలు ముఖ్యంగా ఉదయకాలంలోనే పూర్తిగా చేసుకొవాలి. షుగర్ పెషెంట్లు, బీపీ పెషెంట్లు పాలు తాగి కూడా దేవత ఆరాధన చేయోచ్చని పండితులు చెబుతుంటారు. కొందరికి హైలెవ్ బీపీ, షుగర్ సమస్యలు ఉంటాయి. వీరుమాత్రం వారి వైద్యుల సూచనల ప్రకారం డైట్ ను తీసుకొవాలి.  మధ్యమధ్యలో ఫ్రూట్ జ్యూస్ లను, తీసుకొవచ్చు.  

ఉపవాసాలు ఉండేవారు కొబ్బరి నీళ్లు, లెమన్ జ్యూస్ వంటికి తెలికపాటి ద్రావణాలు తాగవచ్చు. అంతేకాకుండా.. టీ లు,కాఫీలు అలవాటు ఉన్నవారు తాగొచ్చని, పండితులు చెబుతుంటారు. కానీ కొందరు బీపీ, షుగర్ పెషెంట్లు మాత్రం పూజ అయ్యే వరకు పచ్చి మంచి నీళ్లు తాగమని కఠినంగా ఉపవాసం ఉంటారు. దీని వల్ల మొదటికే మోసం వస్తుంది.  

పూజలు ఏది చేసిన, ఏ వ్రతం చేసిన, ఆ కొద్ది సమయంలో మన మనస్సు దేవుడి మీద లగ్నంఅయ్యేలా చూసుకొవాలి. అంతేకానీ.. ఒకవైపు పూజలు, మరొక వైపు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడొద్దు. అందుకు ఇటీవల కాలంలో చాలా మంది పూజలు చేసేటప్పుడు ఎక్కువగా నియమాలను పక్కన పెడుతున్నారు. 

శరీరం హెల్తీగా ఉంటేనే.. దేవుడి పూజలు చేయోచ్చు. శరీరంపై సరైన విధంగా కాన్సన్ ట్రెషన్ చేయకుంటే.. అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే శ్రావణ మాసంలో పైన చెప్పిన విధంగా టిప్స్ పాటిస్తూ ఉపవాసాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link