Sravanthi Chokarapu on Exposing: నా బట్టలు నా ఇష్టం.. మీకేంటి నొప్పి అంటున్న స్రవంతి చొక్కారపు!
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు ఈటీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఒక ఇంటర్వ్యూ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. ఆ దెబ్బకు ఏకంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ అవకాశం దక్కించుకోవడంతో ఆమె తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైనది.
అయితే బిగ్ బాస్ లోకి వెళ్లే వరకు ఆమెకు పెళ్లయిందని, ఒక బాబు ఉన్నాడని విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయం బయట పెట్టిన తర్వాత చాలామంది ఆమె మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే కాస్త అందాల ఆరబోత తప్పదు. కానీ స్రవంతి తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి.
పెళ్లి అయ్యి బాబు ఉన్నా కూడా ఇదేం పోయేకాలం అన్నట్లుగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ కామెంట్ల మీద తాజాగా స్రవంతి స్పందించింది. తాను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దీని వెనక 10 ఏళ్ల కష్టం ఉందని చెప్పుకొచ్చింది, కష్టపడితే ఫలితం తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్న ఆమె నా పదేళ్ల కష్టానికి ఫలాల రూపంలో ఫలితం వస్తోంది అని చెప్పుకొచ్చింది.
తనకు పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ లో ఉండడం ఇష్టమే కానీ ఇప్పుడిప్పుడే పని వస్తుంది కాబట్టి రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లయింది బిడ్డ ఉన్నాడు కదా అని సోషల్ మీడియాలో చాలామంది నా డ్రెస్సింగ్ మీద కామెంట్స్ చేస్తారు అయితే అలా కామెంట్ చేసేది మనవాళ్లే కదా అని లైట్ తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.
ఇక నా డ్రెస్సింగ్ విషయంలో నా కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు, బయట వాళ్ళు అనుకుంటే నాకేంటి అంటూ ఆమె కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక ఆమె ట్రోలింగ్ కి గురైన ఫోటోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం చూసేయండి.