Sreeleela: బ్లాక్ కలర్ ఫోటో షూట్ లో శ్రీలీల అందాల రచ్చ.. అమ్మడి దూకుడుకు సోషల్ మీడియా షేక్..!
శ్రీలీల.. ఈ యేడాది మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం'చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ చిత్రంలో శ్రీలీల స్పెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
లాస్ట్ ఇయర్ శ్రీలీల నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. బాలయ్య హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి మూవీ మాత్రమే హిట్ గా నిలిచింది. మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గుంటూరు కారం’ అనుకున్నంత రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు.
అందుకే పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో పాటు.. రవితేజతో చేస్తోన్న మూవీపై శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు ఫ్లాపైతే ఈమె కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగినట్టే.
శ్రీలీల విషయానికొస్తే.. 2001లో జూలై 14న అమెరికాలో జన్మించింది. వీళ్లది తెలుగు ఫ్యామిలీ కావడం విశేషం. ఈమె తల్లి ప్రముఖ గైనకాలిజిస్ట్. విదేశాల్లో పుట్టిన శ్రీలీల బెంగళూరులో చదువు కంప్లీట్ చేసుకుంది. పెళ్లిసందడి కంటే ముందు కిస్, భారతే వంటి కన్నడ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
తెలుగులో శ్రీలీల.. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకులను మెప్పించింది.