Sreeleela: చెప్పలేనంతగా మారిపోయిన శ్రీలీల.. అదే కారణమా..!
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేసుకున్న ఈ హీరోయిన్ ..ఆ తరువాత రవితేజ తో చేసిన ధమాకా చిత్రంతో…తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది.
ధమాకా చిత్రంలో శ్రీలీల క్యూట్ లుక్స్ తో పాటు డాన్స్ కి వందకి వంద మార్కులు పడ్డాయి. ఇక నిర్మాతలు అందరూ ఈమె కోసం క్యూలు కట్టడం ప్రారంభించారు. దాంతో ఈమెకు వరసగా తొమ్మిది సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు శ్రీ లీల స్టార్ హీరోయిన్గా కొనసాగడం కచ్చితంగా అందరూ అనుకున్నారు.
అయితే అన్నీ మనం అనుకున్నట్టే జరగవు అన్నట్టుగా.. శ్రీ లీల నటించిన తొమ్మిది సినిమాలు.. ఆమెకు అనుకున్నంత స్టార్ స్టేటస్ ఇవ్వలేకపోయాయి. ఈ తొమ్మిది సినిమాలలో.. బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం మాత్రమే.. శ్రీలీల నటనకు అవకాశం వుందే పాత్రను ఇవ్వగలిగింది.
ఇక మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారం సైతం.. ఫ్లాప్ అవ్వడంతో.. శ్రీలీలకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కాగా ఒకప్పుడు ఇలా వరస సినిమాలు సైన్ చేస్తూ వచ్చిన శ్రీలీల ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్టు వినికిడి.
అసలు విషయానికి వస్తే.. అప్పట్లో తన పాత్ర గురించి పెద్దగా పట్టించుకోని ఈ హీరోయిన్.. ఇప్పుడు మాత్రం.. కథ.. అందులో తన పాత్ర గురించి ఎక్కువగా వినిమరి సైన్ చేస్తూ ఉన్న. మొత్తానికి శ్రీలీల ఇలా చెప్పలేనంతగా మారిపోయినందుకు అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికైనా శ్రీ లీల నటనకు ప్రాధాన్యత ఉందే సినిమాల్లో కనిపిస్తుంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ హీరోయిన్ కి ఇకనైనా మంచి విజయాలు వస్తాయేమో వేచి చూడాలి..