Sreeleela: బాలీవుడ్ బాట పడుతున్న శ్రీలీల.. క్రేజీ హీరో సినిమాతో బీటౌన్ గ్రాండ్ ఎంట్రీ..

Wed, 23 Oct 2024-2:33 pm,

శ్రీలీల.. ఈ యేడాది  సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా  మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం'మూవీతో పలకరించింది. ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో శ్రీలీల డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

శ్రీలీల విషయానికొస్తే..  2001లో జూలై 14న అమెరికాలో పుట్టి.. బెంగళూరులో పెరిగింది. వీళ్లది తెలుగు నేపథ్యమున్న  కుటుంబం  కావడం విశేషం. ఈమె తల్లి ప్రముఖ గైనకాలిజిస్ట్. విదేశాల్లో పుట్టిన శ్రీలీల బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. తెలుగులో పెళ్లిసందడి కంటే ముందు కిస్, భారతే వంటి కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది.

తెలుగులో శ్రీలీల..  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' చిత్రంతో  పరిచయం అయింది. ఫస్ట్ సినిమాతోనే  తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకులను మనసులను దోచుకుంది.

లాస్ట్ ఇయర్ బాలయ్య కూతురు పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ మినహా  శ్రీలీల నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గుంటూరు కారం’ అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది.

అందుకే పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రవితేజతో చేస్తోన్న సినిమాపై శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది. అంతేకాదు త్వరలో బాలీవుడ్ లో ఓ బడా స్టార్ హీరో మూవీతో నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link