Sreeleela: జీన్స్ స్కర్ట్ లో శ్రీలీల…ఎప్పుడూ లేనంత స్టైలిష్ గా!
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను.. తమ వైపు తిప్పుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంగతి. అయితే శ్రీలీల మాత్రం అది చాలా తేలిగ్గా చేసేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన.. పెళ్లి సందడి సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ హీరోయిన్.
ఇక వెంటనే రవితేజాతో చాన్స్ అందుకొని.. ధమాకా సినిమాలో తన డాన్స్ విశ్వరూపం చూపించింది. దాంతో తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు.
ఇక ఏ హీరోయిన్ అందుకోనంత చాన్సులతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. వరుసగా తొమ్మిది సినిమాలు ఒకేసారి అందుకని సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా త్వరలోనే శ్రీలీల హవా నడిచేతట్టు కనిపిస్తోంది. అందుకు ముఖ్య కారణం అక్కడ అజిత్, విజయ్, కార్తీ సినిమాలలో శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట.
ఈ క్రమంలో శ్రీలీల ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు కాస్త తెగ వైరల్ అవుతూ అందరిని మరింత ఆకట్టుకుంటున్నాయి.