Sreemukhi: ఆకుపచ్చ కోకలో సెగలుపుట్టిస్తోన్న శ్రీముఖి .. పోజులతో చంపేస్తోన్న యాంకరమ్మ ఫోటోలు..
శ్రీముఖి ప్రస్తుతం 'ఆదివారం పరివారం' షో కు హోస్ట్‌గా చేస్తోంది. స్టార్ మా ఛానల్‌లో వస్తున్న ఈ షో దూసుకుపోతుంది.
ప్రతి ఆదివారం టెలిక్యాస్ట్ అయ్యే ఈ షోలో మా టీవీ నటీనటులతో గేమ్స్ ఆడించడం శ్రీముఖి పని
ఈ షో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఎప్పుడూ సీరియల్స్‌లో మాత్రమే కనిపించే నటులు బయట ఎలా ఉంటారు అని అందరూ చూస్తున్నారు.
తమకు ఇష్టమైన సీరియల్ నటులను చూడగలుగుతున్నారు. ఆ టీవీ షో ను శ్రీముఖి తన మాటతీరుతో అదరగొడుతోంది.
శ్రీముఖి హోస్ట్‌గా నిర్వహిస్తోన్న ఈ షో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్తున్నారు.
ఈ షోలో శ్రీముఖి నటులకు ఆటలు, పాటలు, డ్యాన్స్ చేయిస్తుంది అంతేకాదు బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లినవారు కూడా ఈ షోలో పాల్గొంటున్నారు.
సరదాగా సాగిపోతుంది ఈ షో. శ్రీముఖి హోస్టింగ్ చేస్తోన్న ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే అభిమానులు కూడా ఉన్నారు.
అయితే, శ్రీముఖి బిగ్ బాస్ 3 లో పాల్గొన్నారు. ఆమె రన్నరప్‌గా నిలిచారు,ముందుగా 'పటాస్' షో ద్వారా తెలుగువారికి సుపరిచితమే..
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు అంతేకాదు శ్రీముఖి అంతకు ముందు కొన్ని సినిమాల్లో కూడా నటించారు.
అయితే, శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంటారు.
తాజాగా శ్రీముఖి ఆకుపచ్చ రంగులో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చీరకు తగిన జువెలరీతో అమ్మడు పోజులు ఇచ్చింది.
చీరకు తగిన విధంగా జువెలరీ కూడా ధరించింది. హెయిర్ స్టైల్ కూడా సెట్ అయింది. ఈ ఫోటోల్లో శ్రీముఖి హ్యాండ్ టాట్టూ కనిపిస్తోంది.