Sreemukhi Pics : మరీ తగ్గించేస్తోందిగా.. బుల్లి గౌనులో బుల్లితెర రాములమ్మ.. శ్రీముఖి పిక్స్ వైరల్
బుల్లితెరపై శ్రీముఖి పటాస్ షోతో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పటాస్ షోతో వచ్చిన క్రేజే ఆమెకు బిగ్ బాస్ ఇంటికి దారి ఇచ్చినట్టు అయింది.
బిగ్ బాస్ మూడో సీజన్‌లో శ్రీముఖి ఎంట్రీ ఇవ్వడంతో అంతా ఆమె గెలుస్తుందని అనుకున్నారు. కానీ రాహుల్‌తో అనవసరపు శత్రుత్వం పెట్టుకుని రన్నర్‌గా నిలిచింది.
బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖికి బుల్లితెరపై అంతగా అవకాశాలు రాలేదు. వచ్చిన షోలు క్లిక్ అవ్వకపోవడంతో కాస్త డల్ అయింది.
బిగ్ బాస్ షోతో శ్రీముఖికి కాస్త నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు శ్రీముఖి మంచి ఫాంలో ఉంది. అన్ని చానెళ్లలో శ్రీముఖి షోలు చేస్తోంది.
సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా శ్రీముఖి బుల్లి గౌనులో కనిపించింది. రాను రాను శ్రీముఖి తన డ్రెస్ సైజ్ తగ్గించేస్తోంది.