Sreemukhi: ఆకుపచ్చ డ్రెస్ శ్రీముఖి కిర్రాక్ ఫోజులు.. తన అందంతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోన్న భామ..

Tue, 15 Oct 2024-6:35 am,

తెలుగు టెలివిజన్ యాంకర్‌గా శ్రీముఖి.. కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా సాగిపోతుంది. ప్రెజెంట్ శ్రీముఖి.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీస్  ఈమెకు ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం.

  తెలుగు  బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ షోలో  శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.

గతేడాది  శ్రీముఖి.. తన అభిమాన నటుడు మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ మూవీలో అంతగా ప్రాధాన్యత లేని పాత్ర చేయడం శ్రీముఖి కెరీర్లోనే  ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి దక్కిన తీపి జ్ఞాపకం అని చెప్పాలి.

టీవీ యాంక‌ర్ గా శ్రీముఖి  కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.

 

శ్రీముఖి ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా తనకు సంబంధిచిన విషయాలను  సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ ఉంటుంది.

నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో  రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు.

గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు శ్రీముఖి  అతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.   

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link