Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..
త్రేతాయుగంలో శ్రీ రాముడు చైత్ర శుధ్ద నవమి రోజున జన్మించాడు. ఆయన పునర్వసు రాశి, కర్కాటక లగ్నంలో రామయ్య జన్మించాడు. శ్రీరాముడు తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు.
చిన్నప్పుడే సోదరుడితో కలిసి విశ్వామిత్రుడి వెంట అడవుల బాటపడ్డాడు. అదే విధంగా ఎన్నో కష్టాలను తట్టుకుని, తపస్సులు చేసి గొప్ప అస్త్రశస్త్రాలను పొందాడు. ఎందరో దానవులను హతమార్చి మునులకు ఇబ్బందులు లేకుండా చేశారు.
రామయ్య తన సోదరుల పట్ల ఎంతో వాత్సల్యంతో ఉండేవాడు. తన ముగ్గురు తల్లులను కూడా సమానంగా ప్రేమాను రాగాలు, గౌరవాలతో ఉండేవాడు. ఏనాడు కూడా ఒకరిమనస్సులను నొప్పించినవాడు కాదు.
తన తండ్రి ఇచ్చిన మాట కోసం.. పద్నాళుగెళ్లు అరణ్య వాసం చేశాడు. తన కోసం తమ్ముడు లక్ష్మణుడు ,సీతా దేవీ అరణ్యానికి వస్తానంటూ వద్దని వారించాడు. కానీ వాళ్లు మాత్రం రాముడి వెంట నడిచి తమ ప్రేమను చాటుకున్నారు.
అరణ్యవాసంలో కూడా రాముడు, సీతా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఇంతలో ఊహించని ఆపద జింక రూపంలో ఎదురైంది. మారీచుడు మారువేశంలో సీతను ఏమార్చాడు. సీతా దేవీ ఆ మాయజింక కావాలని రాముడ్ని కోరింది.
రాముడు జింక కోసం వెళ్లగా.. రావణుడు మారువేశంలో సీతమ్మ తల్లిని అపహారించాడు. ఆ తర్వాత హనుమ సహాయంతో రాముడు సీతా జాడను కనుక్కొన్నాడు. దీనికి అనేక మంది వానరులు తమ వంతుగా సహాయం అందించాడు.
లంక నగరానికి రాముడు వారధిని కట్టాడు. ఆ ఆతర్వాత రాముడు, లంకకు వెళ్లి రావణుడితో యుద్దం చేసి, సీతమ్మతల్లిని మరల కలుసుకున్నాడు. మరల సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయాలని చెప్పి, ఆమె ఎంతో పతివ్రతో అందరికి తెలిసేలా చేశాడు.
శ్రీ రామయణంలో తండ్రి మాటను రాముడు కాదనకపోవడం, ఎన్ని కష్టాలున్న భర్తతో ఉన్న సీతమ్మ, సోదరుడి చేయి వదలని లక్ష్మణుడు, తన స్వామి కోసం ఎంతకైన తెగించే హనుమంతుడు, రాముడు, సుగ్రీవుల మైత్రి ఇలా రామయణం నుంచి మనం ఎన్నో విషయాలను నెర్చుకొవచ్చు. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు..