Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?
శ్రీరామ నవమి వేడుకలను ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా, వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని అందంగా పూలతో అలకంరిస్తారు. అదే విధంగా రాముడికి బెల్లం పానకం, వడపప్పులు నైవేద్యంగా సమర్పిస్తారు. రాముడికి, సీతమ్మకు బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరమని పండితులు చెబుతుంటారు.
బెల్లం పానకం సమ్మర్ లో ఎక్కువగా ప్రతిరోజు ఒక గ్లాసు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో శరీరంలో వేడి సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. కొందరికి మూత్ర సంబంధిత ఇబ్బందులు కల్గుతుంటాయి.
ఇలాంటి వారు బెల్లం పానకం తాగితే, వెంటనే ఉపశమనం లభిస్తుంది. బెల్లంను మెత్తగా తురుముకుని, నీళ్లలో వేసుకొవాలి. ఆతర్వాత యాలకులు, శోంఠి, మిరియాలను పౌడర్ లాగా చేసుకొవాలి. ఈ పౌడర్ ను బెల్లం నీళ్లలో వేసి ఒక ఐదు నిముషాలు బాగా కలపాలి.
ఇలా చేసిన బెల్లం పానకం తాగడంవల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటే తగ్గిపొతాయి. అదే విధంగా అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఉపశమనంగా చెప్పుకొవచ్చు. అనవసర కొవ్వు ఇట్టే కరిగిపోయేలా చేస్తుంది. శరీరంను చల్లగా ఉంచుతుంది.
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కొందరు అధిక ఒత్తిడితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు బెల్లం పానకం డైలీ తాగాలి.
చక్కెరకు బదులుగా బెల్లం పానకం తాగితే మనకు అధిక ప్రయోజనముందని చెబుతుంటారు. బెల్లం వల్ల పీరియడ్స్ సమయంలో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే బ్లీడింగ్ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)