Sri Rama Navami Pooja Muhuratham: శ్రీరామ నవమి రోజు పూజా ముహూర్తం.. ఎపుడు ఎలా చేసుకోవాలంటే.. ?

Tue, 16 Apr 2024-1:24 pm,

Sri Rama Navami Pooja Muhuratham: జగదానందకారకుడైన శ్రీరామ చంద్రుడు లోక కళ్యాణం కోసం పుట్టిన మహనీయుడు. అందుకే భక్తికోటి ఆ ఆయన జన్మతిథి రోజున సీతారామకళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తోంది.  శ్రీసీతారామ కళ్యాణం ముహూర్తం విషయానికొస్తే..

రాతిని నాతిని చేసే పరమపాదం రాముడు. ఆయనది ఖండంతార ఖ్యాతి. రాముడు ఆదర్శపురుషుడు. స్థితి కారకుడైన మహావిష్ణువు మానవరూపంలో దివినుంచి భువికి దిగివచ్చిన దివ్యరూపమే రామావతారం.

భారతీయులందరికి ఆయన ఒక మార్గదర్శి. రాముడు ఉన్నత వ్యక్తిత్వానికి ప్రతిరూపం. కుటుంబ విలువలను నిలబెట్టిన వ్యక్తి. ఆయన సత్యపాలకుడు. ఏక పత్నీవతుడు. ఆ ఆదర్శమూర్తి జన్మదినం రోజున జరుపుకునే శ్రీరామ నవమి హిందువులకు పెద్ద పండగ.

సీతా రామ కళ్యాణం తర్వాతనే మన దగ్గర కొత్త యేడాదిలో  పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కావడం ఆనవాయితీ వస్తోంది. ఉత్తరాది ప్రాంతాల్లో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులుగా జరుపుకుంటారు. తొమ్మిదో రోజు సీతారామ కళ్యాణం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువు బంధువలందరు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

శ్రీరామ చంద్రుడి విషయానికొస్తే.. పాలకుడి బాధ్యతకు అర్ధాన్ని చెప్పి కోట్లాది మంది జీవనవేదమయ్యారు.  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు.. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడు.  ఆ మహనీయుని జన్మ దినమున ప్రజలు జరుపుకునే పండుగ శ్రీరామనవమి.

17/4/2024 రోజున మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత రాముడు పుట్టిన అభిజిత్ ముహూర్తంలో సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సారి రాముడి జన్మ తిథి పునర్వసు లేకుండా పుష్యమి నక్షత్రంతో కూడిన ముహూర్తం ఉంది.

శ్రీరాముడి జన్మదినం, కళ్యాణ వేడుకలు ఒకే సారి జరుపడం ఆనవాయితీ వస్తోంది. సీతారామ కళ్యాణము, రావణున్ని దసరా రోజున సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. నవమి మరునాడు దశమి నాడు శ్రీరామ చంద్రుడికి అయోధ్య పట్టాభిషేకం జరుగిందని రామాయణం చెబుతోంది. . అంతేకాదు.. ప్రతి రామాలయంలో శ్రీరాముడికి అత్యంత ప్రీతి భక్తుడైనా ఆంజనేయుడు కొలువై ఉంటాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link