Sridevi Death Anniversary: దేవలోకం నుంచి భువికి దిగొచ్చిన అందాల తార.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు!!
2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో విద్యుదఘాతానికి గురైన శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో మృతి చెందారు. అందాల తార ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
సినిమా పరిశ్రమలో శ్రీదేవి లేని లోటును తీర్చడానికి ఆమె కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ప్రయత్నిస్తున్నారు. జాన్వీ అచ్చు తల్లిలాగే ఉండడంతో పాపులర్ అయ్యారు. జాన్వీ తన అందం, అభినయంతో శ్రీదేవి వారసురాలిగా వెలుగొందుతున్నారు.
అందాల తార శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి భారత సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లతోనే కాకుండా చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో కూడా ఆడిపాడారు.
శ్రీదేవి తన అందాన్ని కాపాడుకోవడానికి దాదాపు 29 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని ఇండస్ట్రీ టాక్. మరణానికి కొంతకాలం ముందు కూడా ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారట.
'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి 35 లక్షల పారితోషికం తీసుకోగా.. అతడికి ధీటుగా శ్రీదేవి కూడా 25 లక్షలు తీసుకున్నారని సమాచారం.