Mahesh Babu: మహేష్ బాబు ఇక ఫోన్ వాడకూడదు.. అగ్రిమెంట్ లో సైతం సంతకం!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో అభిమానులు ఎంతగానో ఎదురు చూసే సినిమా షూటింగ్..త్వరలోనే మొదలు కాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలను మొదలు పెట్టడమే కాకుండా రాజమౌళి తన ఇంస్టాగ్రామ్ నుంచి సింహాన్ని బోనులో బంధించినట్లుగా ఒక వీడియోని షేర్ చేస్తూ.. అందులో పాస్పోర్ట్ తీసుకున్నట్లుగా చూపించారు.

ఈ వీడియోలకు మహేష్ బాబు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి SSMB -29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి.. ఒక అప్డేట్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో.. జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు కూడా బయటికి రాకూడదని చిత్ర బృందం చాలా జాగ్రత్త పడుతూ ఉన్నదట.

అందుకే మహేష్ తో పాటూ ఎవరూ కూడా సినిమా షూటింగ్ సెట్ లోకి మొబైల్ తీసుకురాకూడదని కండిషన్స్ ని.. రాజమౌళి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అందుకు అగ్రిమెంట్ కింద నాన్ డిస్క్ క్లోజ్ అగ్రిమెంట్ ని చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో SSMB 29 కి సంబంధించి ఎవరైనా లీక్ చేస్తే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందట. మొత్తానికి రాజమౌళి కూడా సినిమా షూటింగ్ విషయంలో ఎప్పుడూ కూడా చాలా పగడ్బందీ గానే ప్లాన్ చేస్తూ తెరకెక్కిస్తూ ఉంటారు.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా కూడా ప్రియాంక చోప్రా నటిస్తోందని అందుకే ఇటీవలే ఇండియాకి వచ్చిందని అలా రెండు తెలుగు రాష్ట్రాలలోని దేవుళ్లను కూడా సందర్శిస్తుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మరొక హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.