Sanju Samson: స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కార్ల కలెక్షన్ చూస్తే కళ్లు చెదురుతాయ్
సంజూ ప్రత్యేకత: క్రికెట్‌లో ఎవరి ప్రత్యేకత వారిదే. అలాంటి వారిలో సంజూ శాంసన్ ప్రత్యేకత వేరు. అగ్ర ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని ప్రతిభ అతడి సొంతం.
ప్రతిభ ఉన్నా: ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం.. పరిస్థితులు కూడా కలిసి రావాలి అంటారు. అవి కలిసి రాకపోవడంతో సంజూకు ఇప్పటికీ రావాల్సిన గుర్తింపు రావడం లేదు.
ఐపీఎల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సంజూ తర్వాతి సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.
కార్లంటే యమ ఇష్టం: భారత క్రికెట్, ఐపీఎల్‌లో రాణిస్తున్న సంజూ బాగానే సంపాదించాడు. అతడికి కార్లంటే యమ ఇష్టం. ఎన్నో ప్రత్యేకమైన కార్లు అతడి వద్ద ఉన్నాయి. ఒకసారి సంజూ శాంసన్ కార్ల కలెక్షన్ చూద్దాం.
ఆడి ఏ6: సంజూ శాంసన్ విలాసవంతమైన ఆడి ఏ6 కారు ఉంది. ఈ కారు విలువ రూ.60 లక్షల నుంచి రూ. 66 లక్షల మధ్య ఉండి ఉంటుంది.
బీఎండబ్ల్యూ 5 సిరీస్: బీఎండబ్ల్యూ 5 సిరీస్ సంజూ గ్యారేజ్‌లో ఉంది. ఈ కారు దాదాపు రూ.52 లక్షలతో మొదలై రూ.69.07 లక్షల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రేంజ్ రోవర్ స్పోర్ట్స్: తరచూ సం జూ శాంసన్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు వినియోగిస్తుంటాడు. దీని ధర వచ్చేసి రూ. 1.64 కోట్ల నుంచి రూ. 1.84 కోట్ మధ్య ఉండవచ్చు.
మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్: సంజూ శాంసన్ వద్ద మెర్సిడెస్-బెంజ్ సీ క్లాస్ కారు ఉంది. ఈ కారు విలువ దాదాపు రూ.55 లక్షల నుంచి రూ.61 లక్షల వరకు ఉంటుంది.
బైక్‌లు కూడా: ఈ కార్లతోపాటు కొన్ని బైక్‌లు కూడా సంజూ వద్ద ఉన్నాయి. ఖాళీ సమయాల్లో కార్లు, బైక్‌లపై సంజూ కేరళ రోడ్డులలో విహరిస్తుంటాడు.