Samantha: కష్టాలకు కేరాఫ్‌గా మారిన సమంత..!.. లీగల్ నోటీసులు పంపిన స్టార్ హీరో..?. . కారణం ఏంటంటే..?
సమంతను చూస్తుంటే కష్టాలకు కేరాఫ్ అడ్రస్ లా చెప్పుకొవచ్చని కొంత మంది నెటిజన్లు ఇటీవల కామెంట్లు చేస్తున్నారు.ఈ నటి చైతులో పెళ్లి జరిగి అందరు హ్యపీగా ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా చైతుతో సామ్.. విడాకులు జరిగాయి.
అంతే కాకుండా.. విడాకుల తర్వాత ఆమె చాలా ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఆ ఒత్తిడిలో ఆమె మయోసైటిస్ వ్యాధికి గురైంది. దీంతో చాలా ఏళ్లు ట్రీట్మెంట్ లోనే గడపాల్సి వచ్చింది.
ఇటీవల సామ్ కోలుకున్నట్లు తెలుస్తొంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ తర్వాత అభిమానుల ముందుకు వచ్చింది. ఇంతలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ సామ్.. గతంపై రచ్చ రచ్చ చేశారు.
ఇది పొనీ అనుకుంటే.. తన మాజీ భర్త ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతుంటే.. మరోవైపు సమంత తండ్రి కన్నుమూశారు. దీంతో మరల సామ్ చాలా ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఇక రక్త బ్రహ్మండ్ వెబ్ సిరిస్ లో సామ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది.
తరచుగా తన ఫీలీంగ్స్ ను సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతు సమంత వార్తలలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. సమంత గతంలో మయోసైటిక్ వ్యాధికి గురికాకన్న ముందు ఒక స్టార్ హీరోతో మూవీకి ఒప్పుకున్నారంట. ఆ ప్రాజెక్ట్.. మాత్రం.. సామ్.. మయోసైటిస్ కు గురికావడం వల్ల ఆగిపోయిందంట.
ఈ క్రమంలో ఆయన ఎన్నిసార్లు సామ్ ను కలిసేందుకు ప్రయత్నించిన కూడా అవాయిడ్ చేసేందట. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ స్టార్ హీరో సమంకు లీగల్ నోటీసులు పంపాడంట. మరీ ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో కానీ.. ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.