Star Heroine: అర డజను పైగా హీరోలతో ఎఫైర్స్.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్.. ఇంతకీ ఎవరామె.. ?

Sun, 18 Feb 2024-10:42 am,

ఒకప్పుడు ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు యువకులు పిచ్చెక్కిపోయేవారు. సీటీలు కొట్టేవారు. ఆమె అందానికి సాహో అనేవారు. ఆమె బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ. త్వరలో ఏడు పదుల వయసులో అడుగుపెట్టబోతున్నా.. ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటెన్ చేయడం అది రేఖకు మాత్రమే సాధ్యమైంది.

రేఖ జీవితం ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ తెరకెక్కించిన 'అంతులేని కథ' తరహాలో ఉంటుందనే చెప్పాలి. స్టార్ హీరో కూతురు అయినా.. ఎన్నో వివక్షలను ఎదుర్కొంది. ఎన్నో కష్టాలను ఓర్చుకుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఈ రేంజ్ కష్టాలు అనుభవించిన నటి బహుశా ఎవరు ఉండరేమో.

తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు ఈమె వ్యక్తిగత జీవితం కూడా ఎంతో వివాదాస్పదం. అది ఒక సినిమాకు మించిన ట్విస్టులు ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఉన్నాయి.

రేఖ పేరుతో ముడిపడి ఉన్న ఫస్ట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అని అందరు అనుకుంటారు. కానీ రేఖ జీవితం ముందుగా అప్పటి అగ్ర హీరో జితేంద్రతో ముడిపడి ఉంది. ఆ హీరోతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పటికే జితేంద్ర పెళ్లైన వాడు కావడంతో ఈ బంధానికి బై బై చెప్పేసింది రేఖ.

ఆ తర్వాత బాలీవుడ్‌లో విలన్‌గా రాణిస్తోన్న కిరణ్ కుమార్ అనే ప్రముఖ నటుడితో తన బంధాన్ని కొనసాగించింది. ఈయన తేజాబ్, ఖుదాగవా వంటి పలు సినిమాల్లో మెయిన్ విలన్‌గా నటించారు. ఆపై రేఖ ప్రముఖ హీరో వినోద్ మెహ్రాతో తన బంధం కొనసాగించింది. అతన్ని రేఖ సీక్రెట్‌గా పెళ్లిచేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్త అబద్దం అంటూ ఓ ఇంటర్వ్యూలో రేఖ చెప్పడం గమనార్హం.

అక బిగ్ బీతో రేఖ అనుబంధం మొత్తం సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. 'దో అంజానే' సినిమాలో వీళ్లిద్దరు మొదటిసారి కలిసి నటించారు. అప్పటికే అమితాబ్‌కు పెళ్లైనా.. ఎలాంటి మొహమాటం లేకుండా తన లవ్ ప్రపోజ్ చేసేది. అప్పట్లో అమితాబ్, రేఖలు వివాహాం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ తర్వాత బిగ్ బీ భార్య జయ బచ్చన్ జోక్యం చేసుకొని రేఖతో అమితాబ్ ప్రేమాయణానికి పులిస్టాప్ పడేలా చేసింది. అంతేకాదు   రేఖతో  కలిసి పనిచేయకుండా అమితాబ్‌కు బ్రేకులు వేసిందనే వార్తలు అప్పట్లో బాలీవుడ్‌లో గుప్పుమన్నాయి.

అప్పట్లో అమితాబ్ బచ్చన్, రేఖ, జయా బచ్చన్ కలిసి నటించిన 'సిల్‌సిలా' మూవీ అప్పట్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. అంతేకాదు అమితాబ్, రేఖ ఎఫైర్స్ గురించి అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. 

హీరోలతో ఎఫైర్స్ తర్వాత ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారి ముఖేష్ అగర్వాల్‌ను రేఖ పెళ్లి చేసుకుంది. అతనితో రేఖ సంసారం సాఫీగా సాగలేదనే విషయాన్ని 'రేఖ.. అన్‌టోల్డ్ స్టోరీ' పుస్తకంలో పేర్కొంది. ఇక చివరగా ఈమె ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా ఎఫైర్ నడిపిందనే వార్తలు గుప్పుమన్నాయి.

వీళ్లిద్దరు 'జమీన్ ఆస్మాన్' సినిమాలో కలిసి నటించారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదనే విషయాన్ని వాళ్లిద్దరు ఖండించారు కూడా. మొత్తంగా రేఖ జీవితంలో ఓ సినిమాకు కావాల్సినంత మసాలా ఉంది. అది బయోపిక్ తీస్తే ఓ సినిమాకు కావాల్సినంత వినోదం గ్యారంటీ అనే చెప్పాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link