Star Heroine: ఇదేం యవ్వారం.. పబ్లిక్ గా డైరెక్టర్ అయిన తండ్రితో స్టార్ హీరోయిన్ లిప్ లాక్..

Sun, 22 Dec 2024-8:15 pm,

Star Heroine Lip lock:  కొంత మంది హీరోయిన్లు.. కేవలం నటన మీద దృష్టి కేంద్రీకరించి అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడతారు. మరి కొంత మంది మాత్రం కేవలం కాంట్రవర్సీల కోసమే తమ కెరీర్ ను పణంగా పెడుతున్నారు. అలాంటి భామల్లో బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ ఒకరు.

తండ్రి మహేష్ భట్.. బాలీవుడ్ బిగ్ డైరెక్టర్. అంకుల్ విక్రమ్ భట్ కూడా దర్శకుడే. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుంటుంబం నుంచి 17 యేళ్లకే బాలీవుడ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. వరుసగా అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే పలు చిత్రాల్లో నటించి సడెన్ గా తెరమరుగైపోయింది.

చిన వయసులోనే స్టార్ డమ్ అనుభవించి ఆ తర్వాత తెరమరుగై పోయింది. తన అందం, అభినయంతో పూజా భట్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 17 యేళ్ల వయసులోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ భామ 24 ఏళ్లకే నటనకు ప్యాకప్ చెప్పిసి దర్శకురాలిగా మెగాఫోన్ పట్టుకుంది.

తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఛాన్సులు వచ్చినా.. యాక్టింగ్, గ్లామర్ ఒలకబోయడంలో ఎక్కడా మొహమాట పడలేదు. అంతేకాదు ఆమీర్ ఖాన్, నాగార్జున, అక్షయ్, షారుఖ్ వంటి సూపర్ స్టార్స్ సరసన నటించింది. 

అంతేకాదు తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాల్లో  హీరోలతో ఇంటిమేట్ సీన్స్ చేసి ఔరా అనిపించింది. హీరోయిన్ గా పూజా భట్ ఎంతో వేగంగా ఎదిగిందో ఒక్కసారిగా ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అంతేకాదు చిన్న వయసులోనే మద్యపానానికి బానిస అయింది.

అయితే.. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో  పూజా భట్ .. తన తండ్రి దర్శకుడు అయిన మహేష్ భట్ కు పబ్లిక్ గా లిప్ లాక్ కిస్ ఇవ్వడం పెద్ద సంచలనమే అయింది. అప్పట్లో స్టార్ డస్ట్ కవర్ పేజీ కోసం ఈమె చేసిన బోల్డ్ అటెంప్ట్ ఇది.

ఈ ఫోటో షూట్ తో పూజా భట్ తో ఆమె తండ్రి మహేష్ భట్ విమర్శల పాలయ్యారు. కూతురుకు కొంచెం ఇంకిత జ్ఞానం లేదు సరే.. తండ్రైన మహేష్ భట్ .. కన్న కూతురితో ఇలాంటి ఫోటో షూట్ చేయోచ్చా అనే ప్రశ్నలు తలెత్తాయి. దానికి అప్పట్లో పూజా భట్.. మాట్లాడుతూ.. చిన్నపుడు తండ్రి ఎలా చూసేదాన్నో.. లిప్ లాక్ చేసినపుడు ఓ కూతురిగా ఆయనకు ముద్దు పెట్టానంతే..

ఇంతోటి దానికి ఈ రాద్ధాంతం దేనికి అన్నట్టు కవరింగ్ ఇచ్చే పనిలో పడింది. ఏది ఏమైనా తండ్రి మీద కూతురికి..కూతరు మీద తండ్రికి అంత ప్రేమ ఉంటే.. నుదుటిపైనో.. బుగ్గపైనో ముద్దు పెడితే  సరిపోతుంది. అసభ్యకరంగా వయసులో ఉన్న కూతురు మూతి ముద్దు పెడతానంటే ఎలా పెట్టించుకున్నవయ్యా అని ఆయన్ని తిట్టని వాళ్లు లేరు.

పూజా భట్ హీరోయిన్ గా కెరీర్ అంతంగా కాగానే.. జిస్మ్ 2, కజ్రారే, హాలిడే, ఢోకా, పాప్ మరియు జిస్మ్ 3 వంటి బోల్డ్ కంటెంట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే కదా. పూజా భట్ చెల్లెలు ఆలియా భట్.. తెలుగులో ఆర్ఆర్ఆర్ వంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే కదా.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link