YS Jagan: సీఎంగా దిగిపోయినా ప్రజల్లో తగ్గని వైఎస్ జగన్ ప్రజాదరణ
కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.
భాకాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి మాజీ సీఎం జగన్ వినతి పత్రాలను స్వీకరించి.. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.
ప్రజాదర్బార్‌కి వచ్చిన వారి సమస్యల్ని ఓపికగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలకరించడానికి వచ్చిన చిన్నారులతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడారు.
ప్రజా దర్బార్‌కు సాధారణ ప్రజలతోపాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
కడప జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ గురువారానికి మూడో రోజు చేరుకుంది. శుక్రవారం కూడా జగన్ పులివెందులలోనే ఉండనున్నారు.
ప్రజా దర్బార్‌లో కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు.
క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో కిటకిటలాడింది. జగన్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఎగబడ్డారు.
వైఎస్ జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ఉన్నారు.