Rakul Preet: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం.. ప్రభాస్ సినిమా నుంచి ఔట్
తెలుగు సినీ పరిశ్రమలో అందంతో అందరినీ కట్టిపడేసిన నటి రకుల్ ప్రీత్ సింగ్.
మోడలింగ్ నుంచి 2009లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రకుల్ కన్నడ చిత్రం 'గిల్లి'తో తన హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది.
అనంతరం దక్షిణాదితోపాటు హిందీ సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని రకుల్ పరీక్షించుకుంది.
ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రకుల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకులు.. అవమానాలను పంచుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ సినిమా నుంచి తనను అకారణంగా తొలగించారని సంచలన ప్రకటన చేసింది.
ఆ సినిమా చేదు అనుభవాన్ని రకుల్ ప్రీత్ గుర్తుచేసుకుంటూ.. 'అది తెలుగు సినిమా. దాని కోసం నేను నాలుగు రోజులు షూట్ చేశాను. కానీ ఆ తర్వాత నా స్థానంలోకి వేరొకరు వచ్చారు. ప్రభాస్‌తో చేసిన ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సమయంలో నేను కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నా. సినిమా సెట్‌లోనే నా పరీక్షలకు సిద్ధమయ్యేదానిని' అంటూ తెలిపింది.
'కొత్త అమ్మాయిని తీసుకున్నప్పుడు ఇలాంటి చాలా సార్లు జరుగుతుంటాయి. ఇంత జరిగినా నాకు బాధలేదు. ఏదైనా మంచి జరుగుతుందని వేచి చూశా' అని రకుల్ పేర్కొంది.
అయితే రకుల్ ప్రభాస్‌తో నటించాల్సిన సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’. రకుల్‌కు బదులు కాజల్ అగర్వాల్ వచ్చింది. ఈ సినిమాకు ముందు ప్రభాస్, కాజల్ కలిసి నటించిన సినిమా హిట్ కావడంతో మరోసారి అదే జోడీని కొనసాగించాలని నిర్ణయించి కొత్త అమ్మాయిగా ఉన్న రకుల్‌ను పక్కనపెట్టారు.