Sun Transit 2024: అక్టోబర్ 17 నుంచి సూర్య గోచారం, ఈ 5 రాశులకు వద్దంటే డబ్బు

కుంభ రాశి
కుంభ రాశి జాతకులకు అత్యంత అనువైన సమయం. జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. చాలాకాలంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కోర్టు సంబంధిత సమస్యలు క్లియర్ అవుతాయి.

తుల రాశి
సూర్యుడి రాశి పరివర్తనం తులా రాశిపై ఎక్కువగా ఉంటుంది. పనిచేసే చోట గుర్తింపు ఉంటుంది. పెట్టుబడులకు అనువైన సమయం. లాభాలు ఆర్జించవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఆకశ్మిక ధనలాభం లేదా సంపద లభిస్తుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. విద్యార్ధుల కెరీర్ బాగుంటుంది.

కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలమైంది. కెరీర్‌కు సంబంధించి శుభవార్త వింటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి
సూర్యుడు తులా రాశిలో ప్రవేశించడంతో వృషభ రాశి జాతకులకు గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 17 నుంచి ఈ రాశివారికి అంతా అనుకూలమే. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారాలు కలిసొస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి లాభాలు తెచ్చిపెడతాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్ధులకు అనువైన సమయం.
మేష రాశి
గ్రహాల్లో రారాజుగా భావించే సూర్యుడు తులా రాశి ప్రవేశం కారణంగా మేష రాశి జాతకం మారిపోనుంది. ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పు సంభవించనుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్దికంగా పటిష్టంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు విజయవంతమౌతాయి.