Sun Transit 2024: రేపటి నుంచి ఈ 4 రాశులకు మహర్జాతకం, ఊహించని సంపద

Wed, 16 Oct 2024-7:05 pm,

మేష రాశి

మేష రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం అత్యంత లాభాలు కల్గించనుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉండటం వల్ల ఎలాంటి డబ్బు సమస్య ఉత్పన్నం కాదు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.

తులా రాశి

సూర్యుడు తులా రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అమితమైన లాభాలు కలగనున్నాయి. ఇంట్లో కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివచ్చినా ప్రయోజనం ఉంటుంది. ఆర్ధికంగా లాభపడతారు. ఊహించని సంపద వచ్చి పడుతుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు సూర్యుడి గోచారం అత్యంత లాభదాయకంగా ఉండనుంది. ఉద్యోగులు, వ్యాపారులకు చాలా మంచి సమయం. ఎందుకంటే కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువుగా ఉంటుంది. పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. 

కుంభ రాశి

కుంభ రాశి జాతకులకు అక్టోబర్ 17 నుంచి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఈ రాశి జాతకులు పట్టిందల్లా బంగారంగా మారనుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు లేదా వ్యాధులు దూరమౌతాయి. ఉద్యోగులకు మంచి సమయం. పదోన్నతి లభించడమే కాకుండా జీతం భారీగా పెరుగుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు కలిసొస్తుంది. పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link