Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..

Fri, 02 Aug 2024-2:08 pm,

నీట్ లీక్ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 ఎగ్జామ్ లీకేజీ వ్యవహరం ఇటు రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రకంపనలకు కారణమైందని చెప్పుకొవచ్చు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు ఈరోజు (జులై 2) సంచలన తీర్పువెలువరించింది.

నీట్ ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా విద్యార్థులు ఇప్పటికే అనేక మార్లు తమ నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దీనిపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసం.. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాల్సిన అవసరంలేదని తెల్చి చెప్పింది. 

పేపర్ లీకేజీ కేవలం బీహర్ పాట్నా, జార్ఖండ్ లోని హజారీ బాగ్ లకు మాత్రమే పరిమితమైందని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ ను రద్దుచేస్తే 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులుపడుతారని ధర్మాసనం అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరక్కుండా చూసుకొవాల్సిన బాధ్యత ఎన్టీయేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎన్టీయే సంస్కరణల కోసం సుప్రీంకోర్టు నియమించిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలోని కమిటీకి పలు సూచనలు చేసింది. సెప్టెంబరు 30 లోపు కమిటీ రిపోర్టు ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇదిలా ఉండగా.. నీట్ ఘటనలో 13 మందిపై సీబీఐ పోలీసులు చార్జీషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

లీకేజ్ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా వ్యవహరించిన బిహార్‌కు చెందిన నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్‌లతో పాటు విద్యార్థులు ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివేంద్ర కుమార్‌, దనాపూర్‌కు చెందిన జూనియర్ ఇంజినీర్ సికిందర్ యాదవేందులు పేర్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. వీరు.. ఒక్కో విద్యార్ధికి రూ. 30- 35 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపుగా..24 లక్షల మంది నీట్ ను రాశారు. ఎప్పుడు లేని విధంగా.. 67 మంది స్టూడెంట్స్ కు 720 కి గాను.. 720 మార్కులు రావడడంతో నీట్ పై అనుమానాలు బైటపడ్డాయి. అంతేకాకుండా.. హర్యానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్ లో ఆరుగురు విద్యార్థులకు తొలిర్యాంక్ వచ్చింది.ఈ నేపథ్యంలో నీట్ లీకేజీ జరిగినట్లు అంశం బైటపడింది.  

ఈ వ్యవహారంలో..  58 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇప్పటి వరకూ 40 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. నీట్ వ్యవహరంలో.. ప్రధాన నిందితుడు బిహర్ కు చెందిన నితీశ్ కుమార్‌.. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రం లీక్ చేశారన్న ఆరోపణలపై ఈ ఏడాది జైలుకెళ్లినట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link