World Best Tourist Spot: ఆ దేశంలో మన వంద రూపాయలు 20 వేల రూపాయలతో సమానం, ఎక్కడో తెలుసా
ఇండోనేషియా పర్యాటకానికి అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అందమైన సముద్రతీరం, అగ్నిపర్వతాలు, ప్రాచీన ఆలయాలు మరెక్కడా ఉండవు. ఇండోనేషియాలో ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది.
ఇండోనేషియా ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయం, పర్యాటకం, నిర్మాణం, మైనింగ్ రంగాల్లో కీలకం. ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పామ్ ఆయిల్ ఉత్పత్తి, ఎగుమతి చేసే దేశం. దాంతోపాటే బొగ్గు, రాగి, నికెల్ , బంగారం కూడా ప్రసిద్ధి.
కానీ ఆ తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశంగా మారింది. ఇక్కడి హోటల్స్, ఆహారం అన్నీ చాలా చౌక.దీనికితోడు ప్రకృత రమణీయత కారణంగా పర్యాటకంగా అభివృద్ధి చెందింది. ఇండోనేషియా వెళ్లాలంటే ఉచిత వీసా లభిస్తుంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ ఇండోనేషియా దేశానిది.
అదే విధంగా మన దేశపు 100 రూపాయలు ఈ దేశంలో 19,300 రూపాయలకు సమానం. ఇక్కడి కరెన్సీ పేరు రూపియా. కొన్ని శతాబ్దాలకు పూర్వం ఇండోనేషియా హిందూ దేశంగా ఉండేది.
15వ శతాబ్దంలో ఇస్లాం మతం ఇండోనేషియాలో ప్రవేశించింది. అనతికాలంలోనే అతిపెద్ద మతంగా మారింది. పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది కావడంతో చాలామంది సందర్శిస్తుంటారు. మన దేశపు 10 రూపాయలు ఇక్కడ 1931 రూపాయలతో సమానం.
ప్రపంచ పర్యాటక ధామం ఇండోనేషియా. ఇండియా నుంచి ప్రతి యేటా వేలాదిమంది ఇండోనేషియా సందర్శిస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న నాలుగో దేశమిది. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం కూడా ఇదే. ఇండోనేషియా చరిత్ర చాలా ప్రాచీనమైంది.