Surya Grahanam: అక్టోబర్ 2న మహాలయ అమావాస్య, సూర్యగ్రహణం.. ఈ 4 రాశులకు కుభేరయోగం..!
అక్టోబర్ 2 వ తేదీ సూర్యగ్రహణం రానుంది. ఈరోజు మహాలయ అమావాస్య కూడా కన్యారాశిలో గ్రహణం ఏర్పడనుంది. తమ రాశి నుంచి ఆ గ్రహణ రాశికి 12, 8, 4, 1 స్థానాల్లో ఉంటే ఆ రాశులకు చెడు కాలం అని అర్థం.
కన్యరాశి.. 1 వ రాశిలో ఏర్పడనుంది. వీరికి జన్మస్థానంలో జరుగుతుంది. కాబట్టి అనారోగ్యం, కీర్తి ప్రతిష్ఠలు పోగొట్టుకుంటారు. గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో వీరు అత్యంత జాగ్రత్త వహించాలి. ఎంతో సంయమనం పాటించాలి. కన్యరాశివారు ఆచితూచి మాట్లాడాలి.
తుల రాశి.. 12 వ రాశిలో గ్రహణం కాబట్టి ఆస్తులు పోగొట్టుకుంటారు. సూర్యగ్రహణం సమయంలో వీరు మోసపోతారు. ఓ పదిహేను రోజులపాటు ఖర్చులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి.
కుంభరాశి.. 8వ రాశివారికి శత్రు భయం ఉంది. రుణ బాధలు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్రహణం తర్వాత 15 రోజులపాటు కుంభరాశివారు జాగ్రత్తలు పాటించాలి. సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొత్త పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మిథున రాశి.. 4వ స్థానంలో గ్రహణం, తల్లిగారికి అనారోగ్యం, కుటుంబంలో కలహాలు, వాహన గండం, శాంతి కోల్పోతారు.. అందుకే మిథున రాశివారు కూడా సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి.. 11 వస్థానం సూర్యగ్రహణ, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సూర్యగ్రహణం వీరికి అత్యంత బాగా కలిసి వచ్చే కాలం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశివారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం
ధనస్సు రాశి.. దశమ స్థానంలో సూర్యగ్రహణం జరుగుతుంది. కాబట్టి ధనస్సు రాశివారికి కూడా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్లే వారికి ఇది అత్యంత శుభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు.
మేషరాశి.. మేషరాశి వారికి 6వస్థానంలో సూర్యగ్రహణం చోటు చేసుకుంటుంది. కాబట్టి శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యంగా సుర్యగ్రహణ వల్ల మేషరాశివారికి మేలు జరుగుతుంది.
కర్కాటక రాశి.. మూడవ స్థానంలో సూర్యగ్రహణం చోటు చేసుకుంటుంది. దైర్యసాహసాలు, కలహాలు తొలగిపోతాయి మేలు జరిగే రాశి. ఉద్యోగంలో పేరుప్రఖ్యాతలు పొందుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)