Suryakumar Yadav : టీ20 అంటే సూర్యభాయ్‌కు పూనకాలు గ్యారెంటీ.. కివీస్‌తో సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం!
Ind Vs SA : దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారత్ సౌతాఫ్రికాకు చేరుకుంది. మెన్ ఇన్ బ్లూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కివీస్ తో సరీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇరు జట్టు హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. అప్పుడు భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా 4 టీ20లను ఆడేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లింది భారత్. అయితే పొట్టి ఫార్మట్లో సౌతాఫ్రికా జట్టుపై టీమిండియా ఆధిక్యం అయినప్పటికీ..ఈసారి మాత్రం గట్టి పోటీనిచ్చేందుకు ఆతిథ్య టీమ్ రెడీగా ఉంది.
శుక్రవారం డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈక్రమంలోనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డులకు చేరువగా ఉన్న క్రమంలో ఈ మ్యాచుపై మరింత ఆసక్తి నెలకొంది. సూర్యకుమార్ 2021లో ఇంగ్లాండ్‌పై తన T20 అరంగేట్రం చేసాడు. అప్పటి నుంచి సూర్య కుమార్ యాదవ్ 74 టీ20-ఓవర్ మ్యాచ్‌లు ఆడాడు. 169.48 స్ట్రైక్ రేట్‌తో 2544 పరుగులతో కొనసాగుతున్నాడు. 34 ఏళ్ల సూర్యకుమార్ నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు చేశాడు.
రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ చివరిసారిగా బంగ్లాదేశ్‌తో జరిగిన T20 సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూకు నాయకత్వం వహించాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 37.33 సగటుతో 112 పరుగులు చేశాడు. రానున్న టీ20 సిరీస్ లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు బ్రేక్ చేసేందుకు 107 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత కెప్టెన్ దక్షిణాఫ్రికాలో జరిగే 7 టీ20 మ్యాచుల్లో 175.63 స్ట్రైక్ రేటుతో 346 పరుగులు చేశాడు. 20 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రోటీస్‌పై ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. కాగా, డేవిడ్ మిల్లర్ 21 మ్యాచ్‌ల్లో 156.94 స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్-దక్షిణాఫ్రికా T20Iలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించడంతో పాటు, T20I లలో వేగంగా 150 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచే అవకాశం కూడా ఉంది. 74 టీ20 మ్యాచ్‌లు, 71 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ 44 సిక్సర్లు కొట్టాడు. ఈ ఘనత సాధించాలంటే నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 6 సిక్సర్లు కొట్టాల్సి ఉంటుంది. శుక్రవారం ( నవంబర్ 8) డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో ఈ సిరీస్ ప్రారంభమౌతుంది.
ఇక యువ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నాడు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసే అవకాశంతోపాటు ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అర్ష్ దీప్ సింగ్ 56 ఇంటర్నేషనల్ టీ20ల్లో 87 వికెట్లు తీసుకున్నాడు. మరో 13 వికెట్లు తీసినట్లయితే వికెట్ల సెంచరీ అవుతుంది. భారత్ తరపున 100 వికెట్లు తీసి తొలి బౌలర్ గా అర్ష్ దీప్ సింగ్ నిలుస్తాడు.
రెండో టీ20 మ్యాచ్ నవంబర్ 10న గెబర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనుంది. మూడో మ్యాచ్ నవంబర్ 13న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరగనుంది. నవంబర్ 15న వాండరర్స్ స్టేడియంలో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌తో సిరీస్ ముగుస్తుంది.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైష్, అవేష్ ఖాన్, యశ్ దయాల్.