SVBC Chairman: SVBC చైర్మన్ రేసులో ఆ ముగ్గురు.. ? ఎవరికీ దక్కేనో..!

Mon, 02 Dec 2024-1:12 pm,

SVBC Chairman: తాజాగా కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం  బోర్డును నియమించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్థులపైనా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ప్రతిష్ఠాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ నియామకంపైనా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో పలువురు  సినీ ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్, బాలకృష్ణ సైతం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

రేసులో ప్రముఖులు..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కీలక పదవుల ఖరారుపై ఆసక్తి నెలకొంది. టీటీడీ బోర్డుపైన సుదీర్ఘ కసరత్తు తరువాత మీడియా సంస్థ అధినేత బీఆర్ నాయుడుకు అప్పగించారు.

కీలకమైన బీజేపీ, తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన వారికి టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించారు. టీటీడీకి అనుబంధ విభాగమైన ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. ఎస్వీబీసీతో పాటుగా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఎస్‌విఇటిఎ) చైర్మన్‌ నియామకంపైనా కసరత్తు జరుగుతోంది.

మూడు పార్టీల నుంచి ఈ పోస్టుల కోసం లాబీయింగ్ మొదలైంది.జనసేన తిరుపతి నేతల ఆశలు.. ఎస్వీబీసీ సీఈఓ, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటి పైన కసరత్తు మొదలైంది. గతంలో టీడీపీ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు అవకాశం దక్కింది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సినీనటుడు పృధ్వీని ఆ స్థానంలో నియమించారు. కానీ ఆయనపైన ఆరోపణలు రావటంతో తప్పించారు. ఆ తరువాత సాయికృష్ణ యాచేంద్ర ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ పదవి కోసం సినీ ప్రముఖులు మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్రప్రసాద్ పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సామాజికి వర్గానికి కాకుండా..డిప్యూటీ సీఎం పవన్, నందమూరి బాలకృష్ణ ద్వారా మరి కొందరు ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇవ్వాలనే ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది.

దీంతో పవన్ క‌ల్యాణ్, బాలకృష్ణ ద్వారా ఈ పదవి కోసం మరో ఇద్దరు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక ప్రముఖుడి పేరు బాలకృష్ణ సూచించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ అభిప్రాయం సైతం తీసుకున్న తరువాత డిసెంబర్ తొలి వారంలో ఎస్వీబీసీ చైర్మన్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.

అలాగే శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ చైర్మన్‌ పదవి కోసం జనసేన తిరుపతి నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో సినీ రంగం నుంచి ఈ పదవి ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link