Swiggy: స్విగ్గి లవర్స్‎కు గుడ్‎న్యూస్.. దీపావళి సందర్భంగా రోజంతా ఫ్రీ డెలివరీ.. నమ్మలేకపోతున్నారా?

Tue, 01 Oct 2024-3:46 pm,

Swiggy 24/ 7 free delivery: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ..తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. ఇన్‌స్టామార్ట్ పేరుతో తన కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ ద్వారా స్విగ్గీ ఢిల్లీఎన్సీఆర్ లో కొత్త సర్వీసును ప్రారంభించింది. ఇప్పుడు మీరు పగలు లేదా రాత్రి, ఎప్పుడైనా, మీ ఇంటికి ఫ్రీగా కిరాణాలతోపాటు  ఇతర అవసరమైన వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. Swiggy దీపావళి పండుగ సీజన్ కోసం ఈ సర్వీసును ప్రారంభించింది.  ఈ సర్వీసు ద్వారా కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. 

ఈ ఫ్రీ సర్వీసును  ఢిల్లీ, గుర్గావ్,  నోయిడాలో నివసిస్తున్న ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వారు  ఇప్పుడు పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా కిరాణా ఇతర అవసరమైన వస్తువులను ఉచితంగా డెలివరీ చేస్తుంది. వచ్చేది పండగల సీజన్ కాబట్టి మరింత బిజినెస్ పెంచుకునేందుకు స్విగ్గీ ఈ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది.   

Swiggy ఇన్‌స్టామార్ట్ కస్టమర్‌లు ఇకపై డెలివరీ కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. స్విగ్గీ ఈ కొత్త ఆఫర్‌ ద్వారా ప్రజలు ఇంట్లో కూర్చుని వస్తువులను ఆర్డర్ చేసుకోవడం మరింత సులభం అవుతుంది. 

Swiggy ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్‌ను షేర్ చేసింది. ఇది రాత్రిపూట షాపింగ్ చేసే వ్యక్తులు ఏం చేస్తున్నారో చెబుతుంది. కంపెనీ ప్రకారం చిప్స్, భుజియా, ఐస్ క్రీమ్ వంటి వాటిని రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల మధ్య ఆర్డర్ చేస్తుంటారు.   

అంతేకాదు అర్థరాత్రి వ్యక్తులు పాన్ కార్నర్ నుండి లైంగిక సంరక్షణ ఉత్పత్తులు  ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఉదయం మాత్రం  పాలు, గుడ్ల కోసం ఎక్కువ షాపింగ్ చేస్తుంటారని పేర్కొంది.   

దీంతో ఒక ఫన్నీ స్టేట్ మెంట్ ను కూడా షేర్ చేసింది స్విగ్గీ. అందులో "ఓయే లక్కీ లక్కీ ఓయే" అనే కూల్ పాట ప్లే చేశారు. మీకు కావలసిన వస్తువులను తీసుకురావడం ద్వారా స్విగ్గీ మిమ్మల్ని ఎలా సంతోషపెట్టగలదో ఈ పాట చూపిస్తుంది. అంతేకాదు స్విగ్గీ  బియాండ్ స్నాక్స్‌తో చేతులు కలిపింది. ఇప్పుడు బనానా చిప్స్ కూడా యాడ్స్ లో కనిపించనున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link