Taiwan Earthquake: అంత భారీ భూకంపం వచ్చినా 9 మందే మరణం, భూకంపాలకు దీటుగా తైవాన్

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భూకంపాలను తట్టుకునే నిర్మాణాలు ఎక్కువగా కొనసాగించారు.

1999లో సంభవించిన భూకంపంలో 2415 మంది మరణిస్తే ఆదే తీవ్రతతో వచ్చిన భూకంపంలో ఇప్పుడు కేవలం 9 మందే ప్రాణాలు కోల్పోయారు.

విధ్వంసం రేపిన భూకంపం తరువాత తైవాన్ మౌళిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించింది. దాదాపు 1 లక్ష బిల్డింగులను రీ డిజైన్ చేశారు. ఎంతలా అంటే గరిష్టంగా 9 రిక్టర్ స్కేలు తివ్రతను తట్టుకునేలా రూపకల్పన చేశారు.
1999లో జరిగిన ఘోరమైన భూకంపం నుంచి తైవాన్ ఇంకా మర్చిపోలేదు. నాటి భూకంపంలో ఏకంగా 2415 మంది మరణించగా 11 వేలమంది క్షతగాత్రులయ్యారు. 51 వేల బిల్డింగులు దెబ్బతిన్నాయి.
తైవాన్ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో భూకంపాలు తట్టుకునే నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి.